V6 News

ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–15 సీజన్‌‌‌‌‌‌‌‌ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ ఖరారు

ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–15 సీజన్‌‌‌‌‌‌‌‌ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ ఖరారు

న్యూఢిల్లీ: ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–15 సీజన్‌‌‌‌‌‌‌‌ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ ఖరారు అయ్యింది. బ్రాడ్‌‌‌‌‌‌‌‌కాస్టర్స్‌‌‌‌‌‌‌‌ విజ్ఞప్తి మేరకు మార్చి 26 నుంచే లీగ్‌‌‌‌‌‌‌‌ను స్టార్ట్‌‌‌‌‌‌‌‌ చేసేందుకు బీసీసీఐ గ్రీన్‌‌‌‌‌‌‌‌ సిగ్నల్‌‌‌‌‌‌‌‌ ఇచ్చింది. ఈ మేరకు గురువారం జరిగిన ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ గవర్నింగ్‌‌‌‌‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌ (జీసీ)లో నిర్ణయం తీసుకుంది.  మొత్తం 10 టీమ్‌‌‌‌‌‌‌‌లు 72 మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు ఆడే విధంగా షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ను రూపొందించింది. ముంబై, పుణెలో జరిగే లీగ్‌‌‌‌‌‌‌‌ స్టేజ్​కు  స్టార్టింగ్‌‌‌‌‌‌‌‌లో 40 శాతం మంది ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌ను స్టేడియంలోకి అనుమతించనున్నారు. ముంబైలోని వాంఖడే (20 మ్యాచ్​లు), బ్రబౌర్న్‌‌‌‌‌‌‌‌ (15), డీవై పాటిల్‌‌‌‌‌‌‌‌ (20) స్టేడియాలతో పాటు  పుణెలోని ఎంసీఏ స్టేడియం (15)ను వేదికలుగా ఎంపిక చేశారు. అయితే వాంఖడేలో ఆడటం వల్ల ముంబై ఇండియన్స్‌‌‌‌‌‌‌‌కు ఫేవర్‌‌‌‌‌‌‌‌గా ఉంటుందన్న ఇతర ఫ్రాంచైజీల వాదనపై జీసీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్లే ఆఫ్స్‌‌‌‌‌‌‌‌, ఫైనల్‌‌‌‌‌‌‌‌ వేదికలపై రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటించనుంది. వీటిని అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించే చాన్సుంది. ఇక విమెన్‌‌‌‌‌‌‌‌ టీ20 చాలెంజర్‌‌‌‌‌‌‌‌ టోర్నీని ఈ ఏడాది నిర్వహిస్తామని జీసీ ప్రకటించింది.