ఐపీఎల్ ప్రోమో అదిరింది.. స్టార్ స్పోర్ట్స్లో రిలీజ్

ఐపీఎల్ ప్రోమో అదిరింది.. స్టార్ స్పోర్ట్స్లో రిలీజ్

భారత్ తో పాటు ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్2023కి టైం వచ్చేసింది. మార్చి 31 నుంచి ప్రారంభం కానున్న 16వ సీజన్ కోసం ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయి. ఇప్పటికే అన్ని జట్లు రంగానికి  సిద్ధమవుతున్నాయి. ఏ టీం కప్పు కొడుతుందా అని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. ఆ జోరును ఇంకా కొంత పెంచేలా స్టార్ స్పోర్ట్స్ కొత్త ఐపీఎల్ 2023 ప్రోమోను విడుదల చేసింది. 

టాటా ఐపీఎల్ ప్రసార హక్కులను దక్కించుకున్న స్టార్ స్పోర్ట్స్ ఈ వీడియోను షూట్ చేసింది. ట్యూన్, సాంగ్ కంపోజ్ అంతా స్టార్ స్పోర్ట్స్ తీసుకుంది. అందులో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా అభిమానుల్తో కలిసి పాల్గొన్నారు.