మల్కాజ్ గిరికి మహిళా సారథ్యం..సీపీగా ఐపీఎస్ సుమతి బాధ్యతలు

మల్కాజ్ గిరికి మహిళా సారథ్యం..సీపీగా ఐపీఎస్ సుమతి బాధ్యతలు

మల్కాజ్ గిరి పోలీస్ కమిషనరేట్ నూతన కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు ఐపీఎస్ అధికారిణి సుమతి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణే తన ప్రథమ ప్రాధాన్యతని స్పష్టం చేశారు. మల్కాజ్ గిరి కమిషనరేట్‌కు శాంతియుతమైన ప్రాంతంగా మంచి పేరుంది. ఆ పేరును అలాగే నిలబెట్టేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు.  

మల్కాజ్ గిరికిక మొదటి మహిళా కమిషనర్‌గా నియమితం కావడం చాలా ఆనందంగా ఉంది. నాపై నమ్మకం ఉంచిన ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఆధునిక టెక్నాలజీ సాయంతో 'క్వాలిటీ పోలీసింగ్'ను ప్రజలకు చేరువ చేస్తాము.ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందని నా దృష్టికి వచ్చింది. ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌ను మెరుగుపరిచి ప్రజల ఇబ్బందులను తొలగిస్తాము. సైబర్ క్రైమ్స్ పెరుగుతున్న నేపథ్యంలో.. బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించేలా (రిపోర్టింగ్ అండ్ రెస్పాన్స్) వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాము. 

పోలీస్ మేనేజ్‌మెంట్‌ను పెంచి  ప్రజల అవసరాలకు అనుగుణంగా సేవలందిస్తాము. మేమంతా ఒక టీమ్‌లా పనిచేసి కమిషనరేట్ కీర్తిని మరింత పెంచుతాము.మల్కాజ్ గిరి ప్రజల రక్షణ కోసం నిరంతరం శ్రమిస్తానని కమిషనర్ సుమతీ హామీ ఇచ్చారు.