ఆంక్షలు ఎత్తివేస్తేనే అమెరికాతో చర్చలు: హస్సన్‌ రౌహాని

ఆంక్షలు ఎత్తివేస్తేనే అమెరికాతో చర్చలు: హస్సన్‌ రౌహాని

ఆంక్షలను ఎత్తివేస్తేనే అమెరికాతో సంప్రదింపులు జరిపే అంశంపై ఆలోచిస్తామని స్పష్టం చేశారు ఇరాన్‌ అధ్యక్షుడు హస్సన్‌ రౌహాని. ఆంక్షలు ఎత్తివేసేంత వరకు అమెరికాతో ఎలాంటి చర్చలు ఉండబోవన్నారు. ఇరాన్‌ను ఆర్థికంగా దెబ్బతీసేందుకు అమెరికా కుట్ర పన్నిందన్నారు. ఇరాన్‌ నుంచి చమురు దిగుమతి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న దేశాలను ఆంక్షల పేరుతో బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. అమెరికా ఆటలు ఎంత కాలం సాగవని హెచ్చరించారు. ఆంక్షల కారణంగా ఇరాన్‌ చమురు ఎగుమతులు దెబ్బతిన్నాయని, బ్యాంకింగ్‌ రంగంపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. అమెరికా ఆంక్షలు నుంచి వృద్ధి చెందేందుకు ప్రయత్నిస్తున్నాన్నారు. ఇరాన్‌ అణు ఒప్పందానికి రష్యా, చైనా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ దేశాలు మద్దతును కొనసాగిస్తున్నాయని తెలిపారు హస్సన్‌ రౌహాని.