మాస్క్ మళ్లీ వాడొచ్చా?.ఎలాంటి మాస్క్ వాడాలి..

మాస్క్ మళ్లీ వాడొచ్చా?.ఎలాంటి మాస్క్ వాడాలి..

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌‌–19’ను నివారించేందుకు ఎక్కువగా మాస్క్‌‌లు వాడుతున్నారు. సాధారణ వ్యక్తులు టిష్యూస్‌‌, క్లాత్‌‌తోపాటు ఎలాంటి మాస్క్‌‌లైనా వాడొచ్చు. అయితే మెడికల్‌‌ సిబ్బంది, కరోనా కంట్రోల్‌ కోసం పనిచేస్తున్న సిబ్బంది మాత్రం ఎన్‌‌మాస్క్‌‌లు వాడితేనే మంచిది. ఇవి మిగతా మాస్క్‌‌లకన్నా ఎఫెక్టివ్‌గా పని చేస్తాయి. పైగా కరోనా ప్రభావం ఎక్కువున్న ప్రాంతాల్లో మామూలు ప్రజలు కూడా వీటిని వాడుతున్నారు. ప్రస్తుతం వీటి అవసరం పెరిగిన కారణంగా ఇవి తక్కువగా దొరుకుతున్నాయి. దీంతో వీటిని ఒక్కసారే వాడాలా? లేక మళ్లీ వాడుకునే అవకాశం ఉందా? అనే సందేహాలు చాలామందిలో ఉన్నాయి. ఈ విషయంలో నిపుణులు చేస్తున్న సూచనలివి.

రోనాతో పాటు, గాలి ద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఉన్న అన్ని రకాల వైరస్‌‌లను  అరికట్టేందుకు ‘ఎన్‌‌‌‌’ మాస్క్‌‌‌‌లు బాగా పని చేస్తాయి. ఇవి గాలి ద్వారా వైరస్‌‌‌‌ సోకే అవకాశాన్ని 95 శాతం అరికడతాయి. అలాగని వీటివల్ల వైరస్ సోకదనే గ్యారెంటీ అయితే లేదు.

సింగిల్‌‌‌‌ యూజ్‌‌‌‌

‘ఎన్‌‌‌‌’ మాస్క్‌‌‌‌లు ఒక్కసారి వాడేందుకే తయారు చేశారు. అందుకని వీటిని ఒక్కసారి వాడాక పడేయాల్సిందే. ఈ మాస్కులు దాదాపు ఎనిమిది గంటలు పనిచేస్తాయి. వాడే పద్ధతి, ఇతర అంశాలను బట్టి రోజంతా వీటిని వాడుకోవచ్చు. కానీ, ప్రస్తుతం ఇవి దొరకట్లేదు. దీంతో ఒకసారి వాడిన వాటినే మళ్లీ వాడుకోవాలని అనుకుంటున్నారు. అలాంటివాళ్లు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలని నిపుణులు చెప్తున్నారు.

మాస్క్‌‌‌‌ రొటేషన్‌‌‌‌

ఒకసారి మాస్క్‌‌‌‌ వాడాక దాన్ని పక్కనపెట్టి, మరో 72 గంటల తర్వాతే వాడాలి. దీన్ని మాస్క్‌‌‌‌ రొటేషన్‌‌‌‌ అంటారు. ఒకవేళ మాస్క్‌‌‌‌ మీద వైరస్‌‌‌‌ ఉన్నా, అది 72 గంటలకు మించి మాస్క్‌‌‌‌ మీద బతికి ఉండే అవకాశం లేదు. అందుకే 72 గంటల తర్వాత తిరిగి వాడొచ్చు. అయితే ఆ లోపు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే మాస్క్‌‌‌‌ను గాలి తగిలే చోట, పొడి ప్రదేశంలో ఉంచాలి. అలాగే మాస్క్‌‌‌‌ను వైరస్‌‌‌‌ సోకే ప్రదేశంలో ఉంచకూడదు. మధ్యలో మాస్క్‌‌‌‌ను ముట్టుకోకూడదు. మాస్క్‌‌‌‌పక్కన పెట్టినా, వైరస్‌‌‌‌ సోకే అన్ని పరిస్థితులకు దూరంగా ఉంచినప్పుడు మాత్రమే తిరిగి వాడుకోవాలి.

స్టీమింగ్‌‌‌‌

వేడి నీళ్లలో వేయడం లేదా స్టీమింగ్‌‌‌‌ చేయడం ద్వారా మాస్క్‌‌‌‌ తిరిగి వాడొచ్చు. కనీసం 125 డిగ్రీ సెల్సియస్‌‌‌‌ ఉన్న నీటిలో మాస్క్‌‌ను, మూడు నిమిషాలు ఉంచి తీయాలి. అలాగని మాస్క్‌‌‌‌లు వేడినీళ్లలో అటూఇటూ తిప్పకూడదు. దీనివల్ల ఫిల్టర్స్‌‌‌‌, లేయర్స్‌‌‌‌ పాడవుతాయి. మాస్క్‌‌‌‌లో పేపర్‌‌‌‌‌‌‌‌ లేయర్స్‌‌‌‌ ఉంటే అవి పనికి రాకుండా పోతాయి. అవి పాడవకుండా చూసుకోవాలి.

బేకింగ్‌‌‌‌

‘ఎన్‌‌‌‌95’ మాస్క్‌‌‌‌లు ఒవెన్‌లో శుభ్రం చేయొచ్చు. ఉడెన్‌‌‌‌  క్లిప్‌తో, మాస్క్‌‌‌‌ను ఒవెన్‌‌‌‌లో వేలాడ దీయాలి. ఒవెన్‌‌‌‌లో కనీసం 70 డిగ్రీల టెంపరేచర్‌‌‌‌‌‌‌‌ వద్ద, అరగంట ఉంచాలి. అలా ఉంచినప్పుడు మాస్క్‌‌‌‌ను చేతితో పట్టుకోకూడదు.జాగ్రత్తలు

  •     కరోనా పేషెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దగ్గరగా ఉన్న వాళ్లు ‘ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ మాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను తిరిగి వాడకూడదు.
  •     ముఖానికి మాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టుకున్నప్పుడు తప్పనిసరిగా, చేతులకు గ్లోవ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తొడుక్కోవాలి.
  •     రక్తం, నోటి నుంచి వచ్చే తుంపర్లు పడ్డప్పుడు ఆ మాస్కులను మళ్లీ వాడొద్దు.
  •     వ్యక్తిగత శుభ్రత, సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిస్టెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తప్పనిసరిగా పాటించాలి. చేతులను హ్యాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో శుభ్రంగా కడుక్కోవాలి. శానిటైజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడాలి.
  •     హార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాబ్లమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఉబ్బసం, శ్వాస సంబంధిత సమస్యలు, ఇతర జబ్బులు ఉన్న వాళ్లు ఎప్పటికప్పుడు కొత్త మాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు వాడితేనే  బెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.
  •     ఆరోగ్యంగా ఉన్న వాళ్లు ‘ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’  మాస్క్లు వాడాల్సిన అవసరం లేదు. పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, క్లాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాస్కులు సరిపోతాయని నిపుణులు చెప్తున్నారు.
  •     ఏ మాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయినా ఒక్కసారి వాడేందుకే తయారు చేసింది. తప్పనిసరైతేనే రెండోసారి వాడాలి.
  •     క్లాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాస్క్‌‌‌‌‌‌‌‌ను జాగ్రత్తగా ఉతికి, ఎండలో మూడు రోజులు ఆరేయాలి. తిరిగి ఐరన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకుని వాడాలి. ఇవన్నీ చేస్తున్నప్పుడు మాస్క్‌‌‌‌ను ముట్టుకుని, ఇతర  వస్తువులు ముట్టుకోవద్దు. మాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసేటప్పుడు ముక్కు, కళ్లు ముట్టుకోకూడదు.