ఇండియన్‌ ముస్లింలను కరోనా క్యారియర్లగా చెప్పిన ఇస్లామిక్‌ స్టేట్‌

ఇండియన్‌ ముస్లింలను కరోనా క్యారియర్లగా చెప్పిన ఇస్లామిక్‌ స్టేట్‌
  • 17 పేజీల మ్యాగజైన్‌ రాసిన ‘వాయిస్‌ ఆఫ్‌ హింద్‌’

ప్రపంచమంతా కరోనా వైరస్‌తో పోరాడుతుంటే ఇస్లామిక్‌ స్టేట్‌ ఆన్‌లైన్‌ మ్యాగజైన్‌ ‘ వాయిస్‌ ఆఫ్‌ హింద్‌’ భారత్ వ్యతిరేక ప్రచారాన్ని మరింత పెంచే ప్రయత్నం చేసింది. కరోనా వైరస్‌ను భారత్‌పై దాడి చేసే అవకాశంగా మార్చుకోవాలని చూసింది. భారత్ ముస్లింలే కరోనా క్యారియర్లు అని ఆ మ్యాగజైన్‌ ప్రచారం చేసింది. ‘లాక్‌డౌన్‌ స్పెషల్‌’ పేరుతో 17 పేజీల ఎడిషన్‌ తీసుకొచ్చిందని దాంట్లో ఈ విషయాలు చెప్పిందని ఒక నేషనల్‌ మీడియా చెప్పింది. ‘ కిల్‌ కుఫర్స్‌’ అని దాని ద్వారా ప్రచారం చేసింది. అవిశ్వాసులను నిర్మూలించేందుకు రెడీగా ఉండాలని అనుచరులను ప్రోత్సహించింది.

నిజాముద్దీన్‌, మర్కజ్‌ కార్యక్రమానికి హాజరైన వారి ఫొటోతో మ్యాగ్‌జైన్‌ కవర్‌‌ పేజీ వేశారు. ‘‘మీరు వీలైనంత మంది కుఫర్లను చంపే అవకాశాన్ని ఎప్పటికీ కోల్పోకుండా ఉండేందుకు ఎప్పుడు ఆయుధాలు కలిగి ఉండండి. వాళ్లను కొట్టేందుకు చైన్లు, రోప్స్‌, వైర్లు పెట్టుకోండి” అని ఇస్లామిక్‌ స్టేట్‌ ప్రచురించింది. ఆ లాక్‌డౌన్‌ ఎడిషన్‌కి మౌలానా సాద్‌ అనే పేరు పెట్టారు. కరోనా వైరస్‌ సూపర్‌‌ స్ప్రెడర్స్‌ అని ప్రశంసించారు కూడా. అంతేకాకుండా ఢిల్లీ అల్లర్లలో స్టూడెంట్స్‌ అరెస్టులకు ప్రతికారం తీర్చుకోవాలని ఈ మ్యాగజైన్‌ ద్వారా చెప్పింది. ముస్లింలు కరోనా వైరస్‌ క్యారియర్లు అవ్వాలని, పోలీసులకు వైరస్‌ను స్ర్పెడ్‌ చేయాలని ఆ మ్యాగజైన్‌ సూచించింది. కాగా.. జనవరిలో చాలా మంది టెర్రరిస్టులు కేరళలో ఉన్నారని ఇంటెలిజెన్స్‌ వర్గాలు చెప్పారు. ఇప్పుడు ఈ మ్యాగజైన్‌లో ఈ విషయాలు ఉండటం అనుమానాలకు దారి తీస్తోంది. ఇది ఆన్‌లైన్‌లో చాలా మందికి చేరేలా చేశారని కూడా ఒక జాతీయ మీడియా సంస్థ పేర్కొంది.