చంద్రయాన్-3 మహాక్విజ్‌.. ఈ హిస్టారిక్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుందాం రండి

చంద్రయాన్-3 మహాక్విజ్‌.. ఈ హిస్టారిక్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుందాం రండి

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చీఫ్ ఎస్ సోమనాథ్.. భారత పౌరులందరూ చంద్రయాన్-3 మహాక్విజ్‌లో పాల్గొనాలని చెప్పారు. భారతదేశం సాధించిన ఈ అద్భుతమైన అంతరిక్ష పరిశోధన యాత్రకు గౌరవ సూచకంగా  చారిత్రాత్మక చంద్ర ల్యాండింగ్‌ను సెలబ్రెట్ చేసుకోవాలని కోరారు. ఈ క్విజ్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి రూ.లక్ష నగదు బహుమతులు అందజేయనుంది ఇస్రో.

చంద్రయాన్-3 మహాక్విజ్‌లో పాల్గొనాలనుకునే వారు MyGov పోర్టల్‌లో ఖాతాను క్రియేట్ చేయాలి. ఆ తర్వాత 300 సెకన్లలో 10 ప్రశ్నలకు సమాధానాలివ్వాల్సి ఉంటుంది. ఇందులో పాల్గొన్న వారు Mygov పోర్టల్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోగలిగే ప్రశంసా పత్రాన్ని పొందుతారు.

"భారతదేశం చంద్రునిపై ఉంది. భారతీయులందరికీ ఇస్రో చీఫ్ నుంచి ఒక ప్రత్యేక సందేశం వినండి: MyGov పోర్టల్‌లో ప్రత్యేకంగా నిర్వహించే చంద్రయాన్-3 మహాక్విజ్‌ లో పాల్గొనండి. ఈ చారిత్రాత్మక చంద్ర ల్యాండింగ్‌ను కలిసి సెలబ్రేట్ చేసుకుందాం" అని ఇస్రో(ISRO) 'X'లో రాసుకువచ్చింది.

చంద్రయాన్-3 మహాక్విజ్ అవార్డు మనీ..

  •     చంద్రయాన్-3 మహాక్విజ్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన వారికి లక్ష రూపాయల నగదు బహుమతి లభిస్తుంది.
  •     క్విజ్‌లో రెండవ ఉత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి 75వేల రూపాయల నగదు బహుమతిని అందజేస్తారు.
  •     చంద్రయాన్-3 క్విజ్‌లో మూడవ ఉత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి రూ. 50వేల నగదు బహుమతిని అందజేస్తారు.
  •     తదుపరి 100 మంది ఉత్తమ ప్రదర్శనకారులకు ఒక్కొక్కరికి రూ.2వేల చొప్పున కన్సోలేషన్ బహుమతులు అందజేయబడతాయి.
  •     ఆ తర్వాతి 200 మంది ఉత్తమ ప్రదర్శనకారులకు ఒక్కొక్కరికి రూ.1వెయ్యి కన్సోలేషన్ బహుమతులు అందజేయబడతాయి.