మాదాపూర్ లో చిమ్నీ పేలి అగ్నిప్రమాదం.. ఐటీ కారిడార్ లో రెస్టారెంట్ లో ఘటన

మాదాపూర్ లో చిమ్నీ పేలి అగ్నిప్రమాదం.. ఐటీ కారిడార్ లో రెస్టారెంట్ లో ఘటన

గచ్చిబౌలి, వెలుగు: ఐటీ కారిడార్​లోని ఓ రెస్టారెంట్ కిచెన్​లో చిమ్నీ పేలడంతో మంటలు చెలరేగాయి. మాదాపూర్​లోని మెడికవర్ హాస్పిటల్ పక్కన ఉన్న తెలుగు నెస్ రెస్టారెంట్ కిచెన్​లో సోమవారం ఒక్కసారిగా చిమ్నీ బ్లాస్ట్ అయింది. 

పేలుడు ధాటికి కిచెన్​లోని వంట సామగ్రి, ఇతర వస్తువులు దగ్ధమయ్యాయి. ప్రమాదం జరగగానే కిచెన్ నుంచి దట్టమైన పొగ వ్యాపించింది. మాదాపూర్ ఫైర్ స్టేషన్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. చిమ్నీని క్రమం తప్పకుండా శుభ్రం చేయకపోవడం వల్లే పేలుడు సంభవించినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.