ఉదయాన్నే అరటి పండు, వేడి నీళ్లు తాగితే లావు తగ్గుతారా..?

ఉదయాన్నే అరటి పండు, వేడి నీళ్లు తాగితే లావు తగ్గుతారా..?

పండ్లలో పిల్లల నుంచి పెద్దలవరకు అందరూ ఇష్టపడేది అరటిపండునే. ప్రతిరోజూ అరటిపండు తినడం చాలా మంచిది. ఈమధ్య చాలామంది ఒబెసిటీతో బాధపడుతున్నారు... దీన్ని తగ్గించడానికి అనేక మార్గాలు ఉన్నాయి అందులో ఒకటి అరటిపండు. అదేంటి అని ఆశ్చర్యపోతున్నారా? అవును... అరటిపండు, వేడినీళ్లు ఒబెసిటీని తగ్గించడంలో సాయ పడతాయి. 

ఉదయం నిద్రలేచిన వెంటనే తీసుకునే ఫుడ్డే ఆరోగ్యం కాపాడటంలో ముఖ్య పాత్ర పోషి స్తుంది. అందువల్ల రోజూ ఉదయం పరగడుపున అరటిపండు తిని, తర్వాత వెంటనే ఒక గ్లాసు వేడి నీళ్లు తాగితే బరువు అదుపులో ఉంటుంది. ఇప్పటివరకు అరటి పండు, పాల కాంబినేషన్ గురించే చాలామందికి తెలుసు. అరటిపండు పాలలో వేసుకుని తింటే తక్కువ సమయంలోనే బరువు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ అరటిని వేడి నీటితో తీసుకున్నప్పుడు శరీర బరువు.. ముఖ్యంగా పొట్ట తగ్గుతాయి.

►ALSO READ | జ్యోతిష్యం:సింహరాశిలో త్రిగ్రాహి యోగం..బుధాదిత్య రాజయోగం..మూడు రాశుల వారికి దిమ్మతిరిగే లాభాల మూట..!

ఉదయం అరటిపండు తిని, ఒక గ్లాసు వేడి నీళ్లు తాగినప్పు డు. శరీరంలోని మలినాలు బయటికి పోతాయి. అలాగే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దాంతో శరీరంలో కొవ్వులు సులువుగా కరిగి ఒబెసిటీ తగ్గుతుంది. తరచూ చాలా అలసట అని పిస్తుంటే.. ఉదయాన్నే ఒక అరటిపండు తిని వేడినీళ్లు తాగాలి. ఇది శరీరానికి శక్తిని ఇస్తుంది. శారీరక బలహీనతను తొలగిస్తుంది. సో... ఇంకెందుకు లేటు, ఎంతకాలంగానో లావు తగ్గాలని ప్రయత్నించేవారు ఈ ఒక్క చిట్కా ట్రై చేయండి.