స్టాక్ మార్కెట్ అంటే మనోళ్లకే ఎక్కువ ఇష్టం!

స్టాక్ మార్కెట్ అంటే మనోళ్లకే ఎక్కువ ఇష్టం!

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా  స్టాక్ మార్కెట్‌‌‌‌పై ఎక్కువ ప్రేమ కురిపిస్తున్నది ఇండియన్లే! ఇంకా  ఇన్వెస్ట్ చేయడంపై కంటే  ట్రేడింగ్ చేయడంపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని  యూకే ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ సీఎంసీ మార్కెట్స్‌‌ ఓ రిపోర్ట్‌‌లో పేర్కొంది. మార్కెట్‌‌కు సంబంధించి వివిధ దేశాల ప్రజలు గత ఏడాది కాలంలో  చేసిన గూగుల్‌‌ సెర్చ్‌‌ల ఆధారంగా ఈ రిపోర్ట్‌‌ను  విడుదల చేసింది.  అంటే ‘స్టాక్‌‌ మార్కెట్‌‌’, ‘షేర్లు’ ఇలా ఒక్కో పదాన్ని ఏ దేశంలోని ప్రజలు ఎక్కువగా సెర్చ్ చేశారో గూగుల్ ట్రెండ్స్ ద్వారా లెక్కించి, వివిధ పదాలకు వచ్చిన సెర్చ్‌‌ రిజల్ట్స్‌‌ను కలిపి ఫైనల్ స్కోర్‌‌‌‌ను ఇచ్చింది. మొత్తం స్కోర్ 700 అయితే ఇండియా 492 స్కోర్ సాధించి  ప్రపంచంలోనే స్టాక్ మార్కెట్‌‌పై ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్న రెండో దేశంగా నిలిచింది. ఓవరాల్ స్కోర్ 555 తో  సింగపూర్‌‌‌‌ మొదటి ప్లేస్‌‌లో ఉంది. మూడో ప్లేస్‌‌లో  కెనడా (462 స్కోర్‌‌‌‌), నాలుగో ప్లేస్‌‌లో  యూఎస్  (453 స్కోర్‌‌‌‌),  ఐదో ప్లేస్‌‌లో యూఏఈ(374), ఆరో ప్లేస్‌‌లో ఆస్ట్రేలియా (338) నిలిచాయి.  ఏడో ప్లేస్‌‌లో  సౌత్ ఆఫ్రికా, ఎనిమిదో ప్లేస్‌‌లో న్యూజిలాండ్‌‌, తొమ్మిదో ప్లేస్‌‌లో యూకే, పదో ప్లేస్‌‌లో నైజీరియా ఉన్నాయి. 

ఎక్కువగా సెర్చ్‌‌ చేసిన పదాలివే..

ఇండివిడ్యువల్‌‌గా వివిధ పదాలను ఏ దేశంలోని ప్రజలు ఎక్కువగా సెర్చ్ చేశారో కూడా సీఎంసీ మార్కెట్స్ రిపోర్ట్ వెల్లడించింది.  ‘స్టాక్ మార్కెట్‌‌’, ‘స్వింగ్ ట్రేడింగ్ (షార్ట్‌‌ టర్మ్ ట్రేడింగ్‌‌)’ అనే పదాలను ఎక్కువగా సెర్చ్ చేసిన దేశాల్లో ఇండియా రెండో ప్లేస్‌‌లో నిలిచింది. ‘స్టాక్‌‌ మార్కెట్‌‌’ అనే పదాన్ని ఎక్కువగా సెర్చ్‌‌ చేసిన దేశాల్లో యూఎస్ టాప్‌‌లో ఉంది. అదే ‘స్టాక్స్‌‌’, ‘బై స్టాక్స్‌‌’, ‘ఇంట్రెస్ట్ రేట్‌‌’ అనే పదాలను ఎక్కువ సెర్చ్ చేసిన దేశాల్లో  సింగపూర్‌‌‌‌ మొదటి ప్లేస్‌‌లో, ‘స్టాక్‌‌ మార్కెట్‌‌’ పదాన్ని  ఎక్కువగా సెర్చ్ చేసిన దేశాల్లో థర్డ్‌‌ ప్లేస్‌‌లో నిలిచింది.  ‘ఇన్వెస్ట్ ఇన్‌‌ స్టాక్స్‌‌’ అనే పదాన్ని ఎక్కువగా సెర్చ్ చేసిన దేశాల్లో యూఎస్ మొదటి ప్లేస్‌‌లో, కెనడా రెండో ప్లేస్‌‌లో ఉన్నాయి.ని గూగుల్​ తెలిపింది.

డే ట్రేడింగ్‌‌‌‌ వైపు ఆస్ట్రేలియన్లు

ఆస్ట్రేలియన్లు ఇన్వెస్ట్ చేయడం కంటే ఇంట్రాడే ట్రేడింగ్‌‌కు ఎక్కువ ఆసక్తి చూపించారని సీఎంసీ మార్కెట్స్‌‌ రిపోర్ట్ పేర్కొంది.  గత ఏడాది కాలంలో ‘ఇన్వెస్ట్‌‌ ఇన్‌‌ స్టాక్స్‌‌’ పదాన్ని సెర్చ్ చేసిన వారిలో ఆరో ప్లేస్‌‌లో ఉన్న ఆస్ట్రేలియన్లు,  ‘డే ట్రేడింగ్’ అనే పదాన్ని సెర్చ్ చేసిన వారిలో టాప్‌‌లో ఉన్నారు.  ‘స్వింగ్‌‌ ట్రేడింగ్‌‌’ అనే పదాన్ని సెర్చ్‌‌ చేసిన దేశాల్లో  నాల్గో ప్లేస్‌‌లో, ‘డే ట్రేడింగ్‌‌’ అనే పదాన్ని సెర్చ్ చేసిన దేశాల్లో ఐదో ప్లేస్‌‌లో యూఏఈ ఉంది.