Anil Ravipudi: అనిల్కి అన్ని కోట్లా.. వెంకీ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్

Anil Ravipudi: అనిల్కి అన్ని కోట్లా.. వెంకీ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్

ప్రస్తుతం జెనరేషన్ లో టాలీవుడ్ ఇండస్ట్రీకి కామెడీ చిత్రాలకు కేరాఫ్ గా మారిపోయాడు దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi). ఆయన నుండి వచ్చిన ప్రతీ సినిమా కామెడీ ప్రధానంగా వచ్చినవే కావడం విశేషం. మొదటి సినిమా పటాస్ నుండి F2, F3 వరకు ఆయన సినిమాలన్నీ ప్రేక్షకులను కడుపుబ్బా నవించాయి. మధ్యలో మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరూ, బాలకృష్ణతో భగవంత్ కేసరి సినిమాలు కాస్త కమర్షియల్ టచ్ లో ఉంటాయి. అంతేకాదు.. ఇప్పటివరకు అపజయం ఎరుగని దర్శకుడిగా కూడా రికార్డ్ క్రియేట్ చేశాడు అనిల్. 

ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ డైరెక్టర్స్ లిస్టులో చేరిపోయిన అనిల్.. మరోసారి విక్టరీ వెంకటేష్ తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. అవును.. ఈ మధ్యే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ప్రాజెక్టు గురించి ప్రస్తుతం ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. ఈ సినిమా కోసం దర్శకుడు అనిల్ భారీ మిత్తాన్ని రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నాడట. దిల్ రాజు ఈ ప్రాజెక్టు కోసం రూ.15 కోట్లు ఇవ్వడానికి ఒకే అన్నాడట. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

ఇక వెంకీ, అనిల్ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా కూడా వెంకీ స్టైల్లో ఫుల్ ఆన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రానుందట. ఈ సినిమాలో వెంకీకి జోడిగా లేటెస్ట్ బ్యూటీ మీనాక్షి చౌదరి నటిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. త్వరగా కంప్లీట్ చేసి వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చేస్తున్నారట మేకర్స్. మరి హిట్టు కాంబోలో వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.