ట్రాఫిక్ జామ్‌‌‌‌ లో చిక్కుకున్న సుప్రియా సూలే

ట్రాఫిక్ జామ్‌‌‌‌ లో చిక్కుకున్న సుప్రియా సూలే

ముంబై: మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం పుణెలో నిర్వహించనున్న జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి వెళ్తుండగా ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలేకు చేదు అనుభవం ఎదురైంది. ముంబై-–పుణె ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌వేపై ఏర్పడిన భారీ ట్రాఫిక్ జామ్‌‌‌‌లో ఆమె రెండు గంటల పాటు చిక్కుకుపోయారు. 

ట్రాఫిక్ కదలకుండా పూర్తిగా నిలిచిపోయిన సమయంలో ఆమె తన కారు దిగి చుట్టుపక్కల ఉన్న వాహనదారులతో ముచ్చటించారు. ప్రయాణికుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది వైరల్‌‌‌‌గా మారింది.