మేం ఎన్డీయేతోనే ఉండాలనేది అజిత్ నిర్ణయం: సునీల్ తట్కరే

మేం ఎన్డీయేతోనే ఉండాలనేది అజిత్ నిర్ణయం: సునీల్ తట్కరే

ముంబై: తాము బీజేపీ నేతృత్వంలోని పాలక ఎన్డీయే కూటమిలోనే కొనసాగుతామని ఎన్‌‌‌‌‌‌‌‌సీపీ(అజిత్ వర్గం) అధ్యక్షుడు, ఎంపీ సునీల్ తట్కరే వెల్లడించారు. అజిత్ పవార్ భార్య,  ప్రస్తుత మహారాష్ట్ర డిప్యూటీ సీఎం సునేత్రా పవార్‌‌‌‌‌‌‌‌ను ఎన్‌‌‌‌‌‌‌‌సీపీ శాసనసభా పక్ష నాయకురాలిగా నియమించడం పూర్తిగా తమ పార్టీ నిర్ణయమని చెప్పారు. పార్టీ తీసుకున్న డెసిషన్‎తో బీజేపీకి ఎటువంటి సంబంధం లేదన్నారు. 

అధికార ఎన్‌‌‌‌‌‌‌‌సీపీ, ప్రతిపక్ష ఎన్‌‌‌‌‌‌‌‌సీపీ(ఎస్పీ)ల విలీనంపై చర్చలు జరుగుతున్నాయని.. అయితే, ఏ పార్టీ ఏ పార్టీలో విలీనం అవుతుందనే దానిపై స్పష్టత రావాల్సి ఉందన్నారు. ఈమేరకు సోమవారం  సునీల్ తట్కరే మీడియాతో మాట్లాడారు. "ఏ పార్టీ ఎందులో విలీనమవుతుందో స్పష్టత రావాలి. మేం ఎన్డీయేతోనే ఉండాలనేది అజిత్ దాదా నిర్ణయం. రాష్ట్ర ప్రజలు  కూడా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో దాదా నిర్ణయానికి ఆమోదం తెలిపారు. విలీనం గురించి మాట్లాడుతున్నవారు మాతోపాటు ఎన్డీయేలో చేరతారా.. లేదా చెప్పాలి" అని పేర్కొన్నారు.