ఆస్ట్రేలియన్‌‌ ఓపెన్‌‌ టైటిల్‌‌ విజేత సినర్‌‌

ఆస్ట్రేలియన్‌‌ ఓపెన్‌‌ టైటిల్‌‌ విజేత సినర్‌‌

మెల్‌‌బోర్న్‌‌: ఇటలీ యంగ్‌‌ ప్లేయర్‌‌ జానిక్‌‌ సినర్‌‌.. ఆస్ట్రేలియన్‌‌ ఓపెన్‌‌ టైటిల్‌‌ను సాధించాడు. ఆదివారం జరిగిన మెన్స్‌‌ సింగిల్స్‌‌ ఫైనల్లో నాలుగోసీడ్‌‌ సినర్‌‌ (ఇటలీ) 3–6, 3–6, 6–4, 6–4, 6–3తో మూడోసీడ్‌‌ డానిల్‌‌ మెద్వెదెవ్‌‌ (రష్యా)పై సంచలన విజయం సాధించాడు. దీంతో ఆస్ట్రేలియన్‌‌ గ్రాండ్‌‌స్లామ్‌‌ సాధించిన తొలి  ఇటాలియన్‌‌ ప్లేయర్‌‌గా రికార్డులకెక్కాడు. అలాగే జొకోవిచ్‌‌ తర్వాత ఈ టైటిల్‌‌ గెలిచిన యంగెస్ట్‌‌ (22 ఏళ్లు) ప్లేయర్‌‌గా నిలిచాడు.

కెరీర్‌‌లో సినర్‌‌కు ఇదే తొలి మేజర్‌‌ టైటిల్‌‌ కావడం విశేషం. మెద్వెదెవ్‌‌కు ఆరు మేజర్‌‌ ఫైనల్స్‌‌లో ఇది ఐదో ఓటమి. ఈ టోర్నీలో రష్యన్‌‌ ప్లేయర్‌‌కు ఇది నాలుగో ఐదు సెట్ల మ్యాచ్‌‌. దీంతో ఓపెన్‌‌ ఎరాలో మేజర్‌‌ కోర్టులో ఎక్కువ టైమ్‌‌ గడిపిన ప్లేయర్‌‌గా కార్లోస్‌‌ అల్కరాజ్‌‌ (2022 యూఎస్‌‌ ఓపెన్‌‌లో 23 గం. 40 ని.) రికార్డును బ్రేక్‌‌ చేశాడు. మెద్వెదెవ్‌‌తో 3 గంటల 44 నిమిషాల మ్యాచ్‌‌లో సినర్‌‌ తొలి రెండు సెట్లలో ఓడాడు.

కానీ చివరి మూడు సెట్లలో రష్యన్‌‌ ప్లేయర్‌‌ ఎక్స్‌‌పీరియెన్స్‌‌కు అడ్డుకట్ట వేస్తూ అద్భుతంగా పోరాడాడు. మ్యాచ్‌‌ మొత్తంలో సినర్‌‌ 14 ఏస్‌‌లు, 5 డబుల్ ఫాల్ట్స్‌‌ చేయగా, మెద్వెదెవ్‌‌ ఖాతాలో 11 ఏస్‌‌లు, 3 డబుల్ ఫాల్ట్స్‌‌ ఉన్నాయి. ఇద్దరు చెరో4 బ్రేక్‌‌ పాయింట్లను కాపాడుకున్నారు. అయితే 50 విన్నర్స్‌‌ కొట్టిన సినర్‌‌ 49 అన్‌‌ఫోర్స్‌‌డ్‌‌ ఎర్రర్స్‌‌తో పైచేయి సాధించాడు. 

సు వీ- మార్టెన్స్‌‌ జోడీకి విమెన్స్‌‌ డబుల్స్‌‌ టైటిల్‌‌

సీహ్‌‌ సు వీ (చైనీస్‌‌తైపీ)–మార్టెన్స్‌‌ (బెల్జియం) జోడీ విమెన్స్‌‌ డబుల్స్‌‌ టైటిల్‌‌ను కైవసం చేసుకుంది. ఫైనల్లో సువీ–మార్టెన్స్‌‌ 6–1, 7–5తో జెలెనా ఒస్టాపెంకో (లాత్వియా)–లుడుమైలా కిచెనోక్‌‌ (ఉక్రెయిన్‌‌)పై గెలిచారు. అత్యధిక వయసులో గ్రాండ్‌‌స్లామ్‌‌ డబుల్స్‌‌ టైటిల్‌‌ నెగ్గిన ప్లేయర్‌‌గా సు వీ రికార్డులకెక్కింది. ఆమెకు ఇది ఏడో గ్రాండ్‌‌స్లామ్‌‌ టైటిల్‌‌ కాగా, మార్టెన్స్‌‌కు 4వది.