చలికి చెక్‌

చలికి చెక్‌

చలికి చెక్‌

చలికాలం వచ్చిందంటే.. ఎన్నో సమస్యలు. ఈ సమయంలో ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం. అందుకే వింటర్ లో ఆహార విషయంలో అశ్రద్ధ పనికిరాదు. శరీరాన్ని వెచ్చగా ఉంచడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచే ఫుడ్‌ తీసుకోవడం అవసరం. కాబట్టి మనం తినే
ఆహారంలో ఇవి తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. ఆకుకూరలు ఈ కాలంలో ఆకుకూరలను రోజు తీసుకోవడం మంచిది. వీటిలో ఏ, సీ, కే విటమిన్లు అధికంగా ఉంటాయి. ఫోలిక్ యాసిడ్స్‌ కూడా కావాల్సినంత ఉంటుంది. మరీముఖ్యంగా పోషకాలు అధికంగా ఎక్కువగా ఆకుకూరల్లో పాలకూర  కూడా ఒకటి. దీని వల్ల ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌, ఇనుము పుష్కలంగా శరీరానికి చేరతాయి. శరీరంలో ఎర్ర రక్తకణాలను వృద్ధి చేస్తుంది. శ్వాస సంబంధమైన సమస్యలు

తలెత్తకుండా ఉంటాయి. మహిళలు పాలకూర తినడం చాలా మంచిది. మహిళల సౌందర్యా నికి కూడా పాలకూర తోడ్పడుతుంది. తేనె గొంతు నొప్పికి, దగ్గు కు తేనె చాలా మంచిది. తేనె వల్ల గొంతు మెత్తబడుతుంది. గొంతు లో మంట తగ్గు తుంది. తేనెలో ఉండే యాంటి మైక్రోబయల్‌ గుణాలు రోగనిరోధకశక్తిని పెంచుతాయి.       అందుకే రోజుకు ఒక స్పూను తేనె తాగితే మంచిది. తేనె పొట్టను శుభ్రంచేసి జీర్ణశక్తిని పెంచుతుంది. రోజూ ఉదయాన్నే గోరువెచ్చటి నీటిలో తేనె వేసుకుని తాగితే ఎంతో మంచిది. గడ్డ కూరలు ఈ చలికాలంలో గడ్డ కూరలు.. అంటే క్యా రెట్‌, బీట్ ట్‌, ఆలుగడ్డ లాంటి వి తీసుకోవడం శరీరానికి చాలా మంచిది. క్యా రెట్ ఎంత ఎక్కువగా తింటే అంత మంచిది. క్యా రెట్‌లో విటమిన్- సితో పాటు పొటాషియం, మినరల్స్, ఫైబర్స్ ఉంటాయి. కాబట్టి క్యా రెట్‌ను తీసుకోవడం వల్ల శీతాకాలంలో తరుచూ వచ్చే జలుబు, దగ్గు నుం చి ఉపశమనం పొం దొచ్చు. దగ్గు , జలుబుకు కారణమయ్యే బ్యా క్టీరియాతో పోరాడగలిగే శక్తి ఇందులో ఉంటుంది. ఆలుగడ్డల్లో శరీరానికి అవసరమయ్యే

చాలా పోషకాలు ఉన్నాయి. అంతేకాకుం డా రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్ సీ, బీ6 వీటిలో ఉంటాయి. మీడియం సైజులో ఉండే ఒక ఆలుగడ్డ తినడం వల్ల 4 గ్రాముల ఫైబర్ శరీరానికి అందుతుంది. ఒక రోజుకి మగవాళ్లకైతే 38 గ్రాములు, మహిళలకైతే 25 గ్రాముల ఫైబర్ అవసరమవుతుంది. దానిమ్మ చలికాలంలో విటమిన్ సీ పుష్కలంగా ఉండే పండ్లు తీసుకోవాలి. చలికాలంలో దానిమ్మను తీసుకుం టే ఎలాంటి మందులు అవసరం ఉండదని డాక్టర్లు చెబుతారు.

దానిమ్మ గిం జల్ని లేదంటే సలాడ్స్ రూపంలో తీసుకోవచ్చు. ఇది క్యా న్సర్ కణాలను నివారిస్తుంది. యాం టీ ఆక్సిడెండ్లు ఉండే దానిమ్మను తీసుకోవడం ద్వారా హృద్రోగ సమస్యలు దూరమవుతాయి. రోజుకో కప్పు గిం జలు తింటే చెడు కొలెస్ట్రా ల్ రాదు.
కాలిఫ్లవర్‌, క్యాబేజీ చలికాలంలో వచ్చే జలుబు, ఫ్లూ జ్వరాలను ఎదుర్కో వాలంటే నిత్యం మీ డైట్‌లో క్యా లీఫ్లవర్‌ ఉండేట్టు చూసుకోం డి. జలుబు, ఫ్లూను ఎదుర్కొ 

నే శక్తి విటమిన C కి బాగా ఉంది.  విటమిన్‌ సి కాలిఫ్లవర్ లో పుష్కలంగా ఉంది.

చలికాలంలో క్యా లిఫ్లవర్‌ సూప్‌ తాగినా కూడా ఎంతో మంచిది. క్యా బేజీలో పోషకపదార్థా లు బాగా ఉంటాయి. చర్మం పొడిబారడాన్ని తగ్గిస్తుంది. క్యా బేజీలో ఉండే సల్ఫర్‌ శరీరంలో తెల్ల రక్తకణాలను పెంచుతుంది. చలికాలంలో క్యా బేజీ సలాడ్‌ తింటే మంచిది. సీ-విటమిన్‌ ఫ్రూట్స్ చలికాలంలో సీ-విటమిన్ ఫ్రూట్స్ అంటే నిమ్మ, ఆరెం జ్, గ్రేప్స్‌, కివి  ఫ్రూట్స్, టాం గరిన్స్ లాంటి వి తీసుకోవాలి. టాం గరిన్స్ తీసుకోవడం ద్వారా చలికాలంలో వచ్చే చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చు. అలాగే చలిలో శరీరానికి ఎనర్జీ కావాలంటే నిమ్మ, ఆరెం జ్, ద్రాక్ష తీసుకోవాల్సిం దే. అయితే జ్యూ స్ గా తాగాలనుకుం టే.. కాచి చల్లార్చి న
నీటితో తయారు చేసిన జ్యూ స్ లు తీసుకోవడం మంచిది. అలాగే రాత్రిళ్లు కాకుం డా మధ్యాహ్నం
సమయంలో పండ్లు ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు . వెల్లుల్లి వెల్లుల్లి తో చాలా ప్రయోజనాలు ఉన్నాయనే సంగతి తెలిసిం దే. దీన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల అనేక అనారోగ్యా ల బారి నుం చి బయటపడొచ్చు. ముఖ్యంగా చలికాలంలో రోజూ రెండు వెల్లుల్లి రెబ్బల్ని తింటే బ్యా క్టీరియా, వైరస్ ద్వారా వ్యాపిం చే దగ్గు , జలుబుని నయం చేసుకోవచ్చు.వెల్లుల్లి ని పాలతో కాసేపు ఉడికిం చి తినడం ద్వారా గొంతు సమస్యలకు చెక్ పెట్టొచ్చు .