దుబాయ్: బ్యాట్, బాల్‌తో సూపర్‌గా ఆడుతున్న టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ర్యాంకుల్లోనూ టాప్ లేపాడు. టెస్టు ఫార్మాట్‌లో నంబర్ వన్ ఆల్‌రౌండర్‌గా నిలిచాడు. బుధవారం విడుదలైన తాజా జాబితాలో జడ్డూ అగ్ర స్థానాన్ని సంపాదించాడు. శ్రీలంకతో జరిగిన ఫస్ట్ టెస్టులో 175 రన్స్ తో పాటు 9 వికెట్లతో రాణించిన జడేజా.. వెస్టిండీస్ క్రికెటర్ జేసన్ హోల్డర్‌ను వెనక్కునెట్టి టాప్ ప్లేస్ కైవసం చేసుకున్నాడు. జడ్డూ నం.1 ర్యాంక్ అందుకోవడం ఇది రెండోసారి. 2017 ఆగస్టులో వారం రోజులు ఆ ప్లేస్ లో ఉన్నాడు. అశ్విన్ ఒక ప్లేస్ పడిపోయి మూడో ర్యాంక్ లో ఉండగా.. అక్షర్ పటేల్ 14వ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. బ్యాటర్ల జాబితాలో విరాట్ కోహ్లీ రెండు ప్లేస్ లు ఎగబాకి ఐదో ర్యాంక్ లో ఉండగా.. కెప్టెన్ రోహిత్ శర్మ ఐదు నుంచి ఆరో ర్యాంకుకు పడిపోయాడు.
— ICC (@ICC) March 9, 2022

