రైతులపై రేవంత్ తన నైజాన్ని బయట పెట్టాడు : జగదీష్ రెడ్డి

రైతులపై రేవంత్ తన నైజాన్ని బయట పెట్టాడు : జగదీష్ రెడ్డి

రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఎందుకని రేవంత్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడిందన్నారు.   రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే కాంగ్రెస్ కు ఏడుపెందుకని ప్రశ్నించారు. రైతులకు ఉచిత విద్యుత్ ఎందుకివ్వకూడదో చెప్పాలన్నారు. కాంగ్రెస్ వ్యవసాయాన్నినాశనం చేసిందన్నారు. వైఎస్ హయాంలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా రేవంత్ ధర్నాలు చేశారన్నారు. 

చంద్రబాబు వారసుల నాయకత్వం ఇంకా తెలంగాణలో కొనసాగుతుందన్నారు జగదీష్ రెడ్డి.  రేవంత్ రూపంలో తెలంగాణ రైతులకు నెత్తిన పిడుగు పడిందన్నారు. ఉచిత కరెంట్ ఇస్తే నష్టం జరుగుతుందని చంద్రబాబు, ఆయన వారసులు చెప్పే మాటలని విమర్శించారు. రైతులపై రేవంత్ తన నైజాన్ని బయటపెట్టాడన్నారు.

కాంగ్రెస్ జెండా పట్టుకున్న రైతులు ఒక్కసారి ఆలోచన చేయాలన్నారు జగదీష్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ కుట్రలో భాగమే రేవంత్ వ్యాఖ్యలన్నారు.  రైతులకు కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున నిరసన తప్పదని హెచ్చరించారు.  ఎవరు ఎవరితో టచ్ లో ఉన్నారో తమకు తెల్వదు కానీ.. కేసీఆర్ తో తెలంగాణ ప్రజలు టచ్ లో ఉన్నారని తెలిపారు.