శేరిలింగంపల్లిలో బీఆర్ఎస్​కు షాక్

శేరిలింగంపల్లిలో బీఆర్ఎస్​కు షాక్
  • పార్టీకి రాజీనామా చేసిన మాదాపూర్, హఫీజ్ పేట కార్పొరేటర్లు
  • నేడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్​లోకి జగదీశ్వర్ గౌడ్, పూజిత దంపతులు
  • కాంగ్రెస్ నుంచి శేరిలింగంపల్లి టికెట్ కన్ఫమ్ అయినందునే చేరిక?

మాదాపూర్, వెలుగు : శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్​కు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి మాదాపూర్, హఫీజ్​పేట డివిజన్ల కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, పూజిత దంపతులు సోమవారం రాజీనామా చేశారు. కాంగ్రెస్​లో చేరనున్నట్లు ప్రకటించారు.  జగదీశ్వర్​గౌడ్​, పూజిత దంపతులు మంగళవారం జూబ్లీహిల్స్​పెద్దమ్మ గుడిలో పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి పూజలు చేసి భారీ ర్యాలీగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి కాంగ్రెస్​లో చేరనున్నారు. జగదీశ్వర్ రెడ్డి కొంతకాలంగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే టికెట్​కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మళ్లీ సిట్టింగ్​ఎమ్మెల్యేకే బీఆర్ఎస్ టికెట్​ఇవ్వడంతో నిరాశచెందారు.

కాంగ్రెస్​ వైపు చూస్తున్నారని అధిష్టానానికి తెలియడంతో వెంటనే బీఆర్ఎస్​జీహెచ్​ఎంసీ  ఫ్లోర్​ లీడర్ ​పదవి ఇచ్చారు. అయినా ఎమ్మెల్యే టికెట్​కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తీరా ఎమ్మెల్యే గాంధీకి బీఫామ్​ ఇవ్వడంతో బీఆర్​ఎస్​కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వీరితో పాటు నియోజకవర్గంలోని పలువురు నేతలు కార్యకర్తలు కాంగ్రెస్​లో చేరనున్నారు. 

ఎమ్మెల్యే టికెట్ కన్ఫమ్?

కాంగ్రెస్​ నుంచి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే టికెట్ జగదీశ్వర్ రెడ్డికి​ కన్ఫమ్​ కావడంతోనే ఆయన ఆ పార్టీలో చేరుతున్నట్లు తెలుస్తోంది.  ఇప్పటికే బీజేపీ నుంచి కాంగ్రెస్​లో జాయిన్​ అయి టికెట్ ​కోసం పోటీ పడుతున్న రఘునాథ్​ యాదవ్​కు మొండిచేయి అనే టాక్ వినిపిస్తున్నది. 

ఎమ్మెల్యే గాంధీకి ఎదురుదెబ్బ...

మాదాపూర్​, హఫీజ్​పేట్​ కార్పొరేటర్లు బీఆర్ఎస్​ను వీడటంతో ఎమ్మెల్యే అరెకపూడి గాంధీకి సెగ్మెంట్​లో ఎదురుదెబ్బ తగిలింది. రెండు డివిజన్లతో పాటు సెగ్మెంట్​లోనూవీరికి పట్టుఉండడంతో బీఆర్ఎస్​కు బిగ్​షాక్​ అని నేతలు పేర్కొంటున్నారు.