సీఎం మెప్పు కోసమే కాంగ్రెస్‌‌ నేతల ధర్నాలు : బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి 

సీఎం మెప్పు కోసమే కాంగ్రెస్‌‌ నేతల ధర్నాలు : బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి 

హైదరాబాద్​, వెలుగు: కాంగ్రెస్ వాళ్ల ధర్నా చూస్తుంటే ప్రహ్లాదుడి ముందు ప్రగల్భాలు పలికి ఖతమైపోయిన రాక్షసుడిలా ఉందని బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్​ ఎమ్మెల్యే జగదీశ్​రెడ్డి అన్నారు. కొండా సురేఖతో మొదలైంది.. తమ పదవులకు ఎక్కడ ఎసరు వస్తుందోనని మంత్రులు శ్రీధర్​ బాబు, పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌కు భయం పట్టుకుందని తెలిపారు. ఆదివారం ఎర్రవల్లిలో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్​ఎల్పీ మీటింగ్‌‌‌‌కు ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం మెప్పు పొందడానికి ధర్నా కార్యక్రమాలు చేస్తున్నారని విమర్శించారు. సమయానికి నరసింహస్వామి ఏం చేశాడో అలాగే కేసీఆర్​ వచ్చి చేస్తారని చెప్పారు.

పచ్చ కాంగ్రెస్​ పెత్తనం పెరుగుతున్నదని అచ్చ కాంగ్రెస్‌‌‌‌కు భయం పట్టుకుందని పేర్కొన్నారు. ప్రజలు కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను తలచుకుంటున్నారని వెల్లడించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చనందుకు రేవంత్​ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఇప్పటికీ పేదల మనసులోనే ఉన్నారని వివరించారు. అంతర్గత సంక్షోభం నుంచి బయటపడడం కోసమే కాంగ్రెస్ ధర్నా డ్రామాలాడుతున్నదని తెలిపారు. కొండా సురేఖతో మొదలైన సంక్షోభం కొనసాగుతుందని చెప్పారు.