అంతా రాములోరు చూస్కుంటారు మూవీ టైటిల్ గ్లిమ్ప్స్ రిలీజ్..

అంతా రాములోరు చూస్కుంటారు మూవీ టైటిల్ గ్లిమ్ప్స్ రిలీజ్..

సంగీత్ శోభన్, అనస్వర రాజన్ జంటగా పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో  ధీరజ్ మొగిలినేని, గిరిబాబు వల్లభనేని నిర్మిస్తున్న చిత్రం ‘అంతా  రాములోరు చూస్కుంటారు’. ఆదివారం టైటిల్ గ్లింప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  సంగీత్ శోభన్ మాట్లాడుతూ  ‘-మనం దేవుడు చూసుకుంటాడు అని ఆయన మీద ఎంతో కొంత భారం పెడుతుంటాం. 

కానీ ఈ సినిమాలో హీరో మారుతి వందశాతం దేవుడి మీద వదిలేస్తాడు.  అంతా రాములోరు చూస్కుంటారు అని నమ్మి బతికేస్తుంటాడు.  ఇది లవ్ స్టోరీతో పాటు బ్యూటిఫుల్ ఫీల్ గుడ్ ఫిలిం’ అని చెప్పాడు. ఈ చిత్రంలో తాను శిరీష పాత్ర పోషిస్తున్నానని.. మారుతి, శిరీష  క్యారెక్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రతి ఒక్కరూ ప్రేమిస్తారని  హీరోయిన్ అనస్వర రాజన్ చెప్పింది. 

డైరెక్టర్ పల్నాటి సూర్యప్రతాప్ మాట్లాడుతూ ‘ గోదావరి బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూపొందించిన చిత్రమిది. ఈ టైటిల్ వెనుక పెద్ద కాన్సెప్ట్ ఉంది. హీరో హీరోయిన్ జోడీ అందర్నీ మోటివేట్ చేస్తుంది’ అని చెప్పాడు. - ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కూడిన లవ్ స్టోరీనే ఈ చిత్రమని నిర్మాతలు ధీరజ్ మొగిలినేని, గిరిబాబు వల్లభనేని అన్నారు.