టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక మోహన్ వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. తనదైన గ్లామర్‌తోపాటు వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ప్రియాంక మరో క్రేజీ ఆఫర్ దక్కించుకుంది. తాజాగా ఆమె ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న 29వ చిత్రంలో హీరోయిన్‌గా భాగమైంది. ఇటీవల ‘బ్లాస్ట్’ విజయంతో జోష్‌లో ఉన్న ఈ బ్యానర్ నుంచి ‘ఏజీఎస్ 29’ వర్కింగ్ టైటిల్‌తో ఆదివారం కొత్త చిత్రాన్ని ప్రారంభించారు.
ఈ సినిమాకు తమిళ దర్శకుడు ఎంఎస్ ఆనందన్ దర్శకత్వం వహిస్తున్నాడు. జై హీరోగా నటిస్తుండగా.. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా కనిపించనుంది. అలాగే యోగిబాబు కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం ప్రియాంక మోహన్ చేతిలో ఉన్న ప్రాజెక్టుల్లో ఇదొకటి కావడంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.
జై, ప్రియాంక మోహన్ కాంబినేషన్ ప్రేక్షకులకు సరికొత్త ఫీల్‌ను ఇస్తుందని మేకర్స్ తెలియజేశారు. సినిమా టైటిల్, ఫస్ట్ లుక్, ఇతర నటీనటుల వివరాలను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.
