తెలుగు చిత్ర నిర్మాతల మండలి 2026 ఎన్నికల్లో మన ప్యానెల్ విజయం సాధించింది. ప్రెసిడెంట్‌గా సి. కళ్యాణ్ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, ట్రెజరర్‌గా చదలవాడ శ్రీనివాసరావు విజయం సాధించారు. వైస్ ప్రెసిడెంట్లుగా మన ప్యానెల్ నుంచి మోహన్ వడ్లపట్ల, ప్రోగ్రెస్ ప్యానెల్ నుంచి దామోదర ప్రసాద్ ఎన్నికయ్యారు. జాయింట్ సెక్రటరీలుగా అమ్మిరాజు, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గెలుపొందారు.
ఈసీ సభ్యుల్లో మన ప్యానెల్ నుంచి 12 మంది విజయం సాధించగా, ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి ముగ్గురు ఎన్నికయ్యారు. సెక్రటరీ పదవికి సంబంధించిన కేసు కోర్టులో పెండింగ్‌లో ఉండటంతో, ఆ ఫలితాలను ఎన్నికల అధికారి దుర్గా ప్రసాద్ సీల్డ్ కవర్‌లో కోర్టుకు సమర్పించనున్నారు. సెప్టెంబర్ 8న న్యాయమూర్తి సమక్షంలో సెక్రటరీ ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు.
తమకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేసిన ప్రెసిడెంట్ సి.కళ్యాణ్.. నిర్మాతల సంక్షేమం కోసం పనిచేస్తామని, ముఖ్యంగా చిన్న నిర్మాతలకు అండగా నిలుస్తామని చెప్పారు. త్వరలోనే తమ కార్యాచరణను వెల్లడిస్తామని తెలిపారు.
