చంద్రబాబుకు జగన్ ఫోన్ కాల్

చంద్రబాబుకు జగన్ ఫోన్ కాల్

ఏపీ సీఎంగా ఎన్నికైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి …. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఈ ఉదయం ఫోన్ లో కాంటాక్ట్ అయ్యారు. ఈనెల 30వ తేదీన అమరావతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను ప్రమాణ స్వీకారం చేయబోతున్నాననీ.. ఈ కార్యక్రమానికి తప్పకుండా రావాలని చంద్రబాబును జగన్ ఆహ్వానించారు. రాష్ట్ర అభివృద్ధికి విలువైన సలహాలు, సూచనలు ఇవ్వాలని జగన్.. చంద్రబాబును కోరారు.