మసూద్​ అజర్​ జైల్లో లేడు..క్వార్టర్స్ లో రెస్ట్ తీస్కుంటుండు

మసూద్​ అజర్​ జైల్లో లేడు..క్వార్టర్స్ లో రెస్ట్ తీస్కుంటుండు

న్యూఢిల్లీ: టెర్రర్​ మాస్టర్​ మైండ్​ మసూద్​ అజర్​ ను అరెస్టు చేశామని, అనారోగ్యంతో బాధపడుతున్న అజర్​కు జైల్లోనే ట్రీట్​మెంట్​ ఇప్పిస్తున్నామని పాక్​చేసిన ప్రకటన అంతా నాటకమేనని తేలిపోయింది. అజర్​ను అరెస్టు చేసినట్లే చేసి, రహస్యంగా విడుదల చేసినట్లు తమకు సమాచారం అందిందని ఇంటలిజెన్స్​శాఖ ప్రకటించింది. అనారోగ్యానికి ట్రీట్​మెంట్ తీసుకున్న అజర్.. చివరిసారిగా బహవల్పూర్​లోని జైషే హెడ్​క్వార్టర్స్​లో కనిపించినట్లు ఐబీ పేర్కొంది. అనారోగ్యం నుంచి కోలుకున్నా అజర్​ బయటికి రావడంలేదని తెలిపింది. ఆర్టికల్​ 370 రద్దుకు నిరసనగా పాక్​ సర్కారు భారీ కుట్రలు పన్నుతోందని, అందులో భాగంగానే అజర్​ను విడుదల చేసి ఉండొచ్చని ఐబీ అధికారులు అనుమానిస్తున్నారు. తమ భూభాగంలో నుంచి కార్యకలాపాలు చేపడుతున్న టెర్రరిస్టు సంస్థలపై ఉక్కుపాదం మోపుతున్నట్లు ప్రపంచాన్ని నమ్మించేందుకు పాక్​ సర్కారు ప్రకటనలు గుప్పిస్తోంది. పాక్​ ప్రభుత్వం టెర్రరిస్టులకు ఆశ్రయమివ్వడంతో పాటు ట్రైనింగ్ ఇచ్చి ఆయుధాలు సమకూరుస్తుందన్న ఆరోపణలను ఇమ్రాన్​ ఖాన్​ తరచూ ఖండిస్తున్నారు.