బ్యాంకాక్: పారిస్ ఒలింపిక్స్‌కు ముందు ఇండియా స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి సూపర్ ఫామ్‌లోకి వచ్చారు. అద్భుతమైన ఆటతో ఆదివారం ముగిసిన థాయ్‌లాండ్ ఓపెన్‌లో డబుల్స్ టైటిల్‌ను గెలుచుకున్నారు. హోరాహోరీగా సాగిన ఫైనల్లో వరల్డ్ మూడో ర్యాంకర్లు సాత్విక్–చిరాగ్ 21–15, 21–15తో చెన్ బో యంగ్–లియు యి (చైనా)పై నెగ్గారు. మెన్స్ డబుల్స్‌లో ఇండియా ప్లేయర్లకు ఇది 9వ బీడబ్ల్యూఎఫ్ టైటిల్ కావడం విశేషం.
ఈ సీజన్‌లో ఇది రెండోది. మార్చిలో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. అలాగే మలేసియా సూపర్–1000, ఇండియా సూపర్–750 టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచారు. ఒక్క గేమ్ కూడా కోల్పోకుండా ఫైనల్‌కు దూసుకొచ్చిన సాత్విక్–చిరాగ్ అదే జోరును టైటిల్ ఫైట్‌లోనూ కొనసాగించారు. 5–1తో తొలి గేమ్‌ను మొదలుపెట్టిన సాత్విక్ ద్వయాన్ని ఆరంభంలో చైనీస్ జంట నిలువరించింది.
39 షాట్ల ర్యాలీని గెలిచి స్కోరును 7–7తో సమం చేసింది. అదే జోరుతో 10–7తో ముందంజ వేసినా సాత్విక్–చిరాగ్ బుల్లెట్స్‌లాంటి రిటర్న్స్‌తో కట్టిపడేశారు. 14–11 లీడ్‌లో ఈజీగా గేమ్‌ను సాధించారు. రెండో గేమ్‌లో 8–3 ఆధిక్యంతో నిలిచిన ఇండియన్ ద్వయం వెనుదిరిగి చూసుకోలేదు.
