ఎంత మాట అనేశారు.. కోహ్లీ కెప్టెన్సీపై షాకింగ్ కామెంట్స్.. కొత్త వివాదానికి తెరలేపిన సీనియర్స్

ఎంత మాట అనేశారు.. కోహ్లీ కెప్టెన్సీపై షాకింగ్ కామెంట్స్.. కొత్త వివాదానికి తెరలేపిన సీనియర్స్

ఆధునిక క్రికెట్ లో సచిన్ తర్వాత అంతటి దమ్మున్న క్రికెటర్ గా కింగ్ కోహ్లీకి పేరుంది. కోహ్లీ సృష్టించిన రికార్డులు ఆయనను అంత ఎత్తున కూర్చోబెట్టాయి. ఇప్పుడున్న యువతరం కోహ్లీ కోసం జాబ్స్ మానేసి స్టేడియాలకు పరుగులు పెడుతుంటారు. కానీ కింగ్ పై మాజీ క్రికెటర్లు చేసిన కామెంట్స్ కొత్త వివాదానికి దారి తీశాయి. పచ్చిగా చెప్పాలంటే కోహ్లీని కెలికారా..? అన్నంతలా ఆ కామెంట్స్ చర్చకు దారితీస్తున్నాయి. 

కెప్లెన్ గా కింగ్ కోహ్లీ నిరాశపరిచాడని హర్భజన్ సింగ్ లాంటి సీనియర్స్ చెప్పడం వివాదాస్పదం అవుతోంది. ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ టామ్ మూడీ.. కెప్టెన్ గా కోహ్లీ తీవ్ర నిరాశపరిచారని కామెంట్ చేశాడు. జియో హాస్ట్ స్టార్ లో టెలికాస్ట్ అవుతున్న.. రైజ్ ఆఫ్ ఛాంపియన్స్.. అనే ప్రోగ్రాంలో మూడీ, హర్భజన్ ఈ కామెంట్స్ చేశారు. 

2026లో ప్రారంభం కానున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్  సంబంధించి మాట్లాడుతూ.. వైట్ బాల్ క్రికెట్ లో కోహ్లీ తీవ్ర నిరాశపరిచినట్లు టామ్ మూడీ వ్యాఖ్యానించాడు. దీనికి మద్ధతుగా.. కెప్టెన్ గా కోహ్లీ మరిన్ని ట్రోఫీలు గెలవాల్సింది అని.. పరోక్షంగా టామ్ మూడీ అభిప్రాయాన్నే వెల్లడించాడు. 

ఇండియా అంచనాల గురించి .. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ మాట్లాడుతూ.. ఇండియా టీమ్ లో అనుభవం, స్కిల్ ఉన్న ప్లేయర్ గా ఉన్నపుడు అభిమానుల నుంచి చాలా అంచనాలుంటాయి. ప్రతి మ్యాచ్ గెలవాలనే కోరుకుంటారు. కానీ అప్పుడున్న పరిస్థితులను బట్టి గెలుపు ఓటములుంటాయని ఫించ్ అన్నాడు.

టెస్టు కెప్టెన్ గా సక్సెస్ అయినప్పటికీ.. వైట్ బాల్ కెప్టెన్ గా కోహ్లీ నిరాశపరిచాడని భజ్జీ కామెంట్స్ చేశాడు. వైట్ బాల్ కెప్టెన్ గా గొప్ప గొప్ప ట్రోఫీలు ఇండియా గెలవలేకపోయిందని అన్నాడు. 2017  ఐసీసీ చాపింయన్స్ ట్రోఫీ ఫైనల్ లో.. 180 రన్స్ తేడాతో చిరకాల ప్రత్యర్థులకు ట్రోఫీ దక్కడం దారుణంగా అన్నారు. 2019 లో జరిగిన ఐసీసీ వరల్డ్ సెమీస్ లో.. న్యూజీలాండ్ పై 18 రన్స్ తోడాతో  ఓడిపోవడం దారుణంనగా పరిగణించారు. ఎందకంటే ఆ మ్యాచ్ లో కేవలం 240 టార్గెట్ ను ఇండియా బీట్ చేయలేకపోవడం తీవ్ర నిరాశకు గురిచేసినట్లు చెప్పాడు. 

కోహ్లీకి అండగా డివిలియర్స్:

కోహ్లీకి చాలా మంచి టీమ్ ఉండేది. ఆ లెక్కన చూసుకుంటే కింగ్.. కనీసం మరిన్ని అంటే మూడు నాలుగు ట్రోఫీలు గెలవాల్సి ఉండబెనని.. అభిప్రాయం వ్యక్తం చేశారు

మరో వైపు సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ.. కోహ్లీ, రవిశాస్త్రి సెలక్షన్ లో.. ఆటగాళ్లను కొనుకునే తీరు తీవ్ర నిరాశకు గురిచేసనట్లు చెప్పాడు. అయితే కోహ్లీకి సన్నిహితుడిగా పేరున్న ఏబీ డివిలియర్స్ మాత్రం.. కోహ్లికి మద్ధతుగా నిలిచాడు. వరల్డ్ కప్ గెలుపు ఆధారంగా ప్లేయర్లను జడ్జ్ చేయడం చాలా చిరాకు కలిగించే అంశమని అన్నాడు. ఆ ప్లేయర్ వరల్డ్ కప్ గెలవలేదు.. అతడు యూజ్ లెస్ అనటం కరెక్ట్ కాదని అన్నాడు.