షార్జా: తెలంగాణ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఎరిగైసి.. షార్జా మాస్టర్స్ చెస్ టోర్నీలో ఐదో రౌండ్ గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. ఆదివారం వలోదర్ ముర్జిన్ (రష్యా)తో జరిగిన ఈ గేమ్‌లో క్వీన్ పాన్ స్ట్రాటజీతో ఆడిన అర్జున్ మధ్యలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అయితే నిలకడగా ఎత్తులు మారుస్తూ ముర్జిన్‌ను కట్టడి చేశాడు. చివరకు ఇద్దరి వద్ద పాన్స్ లేకపోవడంతో ఇరువురూ డ్రాకు అంగీకరించారు.
ఈ రౌండ్ తర్వాత అర్జున్ మూడున్నర పాయింట్లతో మరో 8 మందితో కలిసి సంయుక్తంగా టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. విమెన్స్‌లో ద్రోణవల్లి హారిక (1.5).. ఎమ్రి కాన్ (టర్కీ–2.5) చేతిలో ఓడింది.
