
- ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సదానందం గౌడ్
హైదరాబాద్, వెలుగు : ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే 40 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్టీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.సదానందం గౌడ్ కోరారు. ఆదివారం ఎస్టీయూ భవన్‌లో రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ బి.రవి అధ్యక్షతన రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సదానందం గౌడ్ మాట్లాడుతూ..
టెట్‌పై ఎన్‌సీటీఈ నుంచి క్లారిఫికేషన్ వచ్చిందని, మరోవైపు, హైకోర్టు కూడా ఎస్‌జీటీలకు టెట్ నుంచి మినహాయింపు ఇచ్చిందని తెలిపారు. కాబట్టి వెంటనే టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల షెడ్యూల్ రిలీజ్ చేయాలని కోరారు. సర్కారు, పంచాయతీ రాజ్ టీచర్లకు ఉమ్మడి సర్వీస్ నిబంధనలు లేక, పర్యవేక్షణాధికారి పోస్టులు భర్తీకాక విద్యా శాఖలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని గుర్తుచేశారు.