కోబె (జపాన్): ఇండియా పారా అథ్లెట్ నిషాద్ కుమార్.. వరల్డ్ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో సిల్వర్ మెడల్ గెలిచాడు. ఆదివారం జరిగిన మెన్స్ టీ–47 హైజంప్‌లో నిషాద్ 1.99 మీటర్ల ఎత్తును క్లియర్ చేసి రెండో ప్లేస్‌లో నిలిచాడు. 2.05 మీటర్ల ఎత్తును అధిగమించిన రోడెరిక్ టౌన్సెండ్ (అమెరికా)కు గోల్డ్ దక్కింది. ఇక ఇండియాకే చెందిన రామ్ పాల్ 1.90 మీటర్లతో ఆరో ప్లేస్‌లో నిలిచాడు.
విమెన్స్ టీ–35, 200 మీటర్ల ఫైనల్లో ప్రీతి పాల్ 30.49 సెకన్ల టైమింగ్‌తో మూడో ప్లేస్‌లో నిలిచి బ్రాంజ్ మెడల్‌ను సొంతం చేసుకుంది. దీప్తి జీవాంజి.. విమెన్స్ టీ–20, 400 మీటర్ల ఫైనల్‌కు అర్హత సాధించింది. హీట్స్‌లో దీప్తి 56.18 సెకన్ల టైమింగ్‌తో లక్ష్యాన్ని చేరింది. ఓవరాల్‌గా ఓ సిల్వర్, బ్రాంజ్ మెడల్‌తో ఇండియా 29వ ప్లేస్‌లో ఉంది.
