అద్భుత విజువల్ వండర్ ‘అవతార్ 3’ (Avatar Fire and Ash) ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. 2025 డిసెంబర్ 19న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమా, దాదాపు 6 నెలల తర్వాత ఓటీటీలోకి అడుగుపెట్టనుంది.
లేటెస్ట్గా ‘అవతార్ 3’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. వచ్చే నెల జూన్ 24 నుంచి డిస్ని+హాట్ స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులోకి రానుందని సదరు ఓటీటీ ప్లాట్ఫామ్ వెల్లడించింది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీ ప్లస్‌లో రెంటల్ విధానంలో అందుబాటులో ఉన్న ఈ చిత్రం, ఇప్పుడు పూర్తి స్థాయిలో మరింత మంది ప్రేక్షకులకు చేరనుంది.
మాస్టర్ పీస్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన అవతార్ 3, థియేటర్లలో మిక్సెడ్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మాత్రం భారీ వసూళ్లు సాధించింది. సుమారు రూ.3300 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.14 వేల కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇండియాలోనే రూ.236 కోట్ల గ్రాస్ వసూలు చేసి మరోసారి ‘అవతార్’ ఫ్రాంచైజీ క్రేజ్‌ను నిరూపించింది.
ALSO READ : అల్లు అర్జున్ సరసన మళ్లీ పూజా హెగ్డే..
Stream Avatar: Fire and Ash only on Disney+ June 24. pic.twitter.com/XFEpp6BJDz
— Avatar (@officialavatar) May 12, 2026
హైప్ తగ్గడానికి కారణమేంటి?
మొదటి భాగానికి (2009), రెండో భాగానికి (2022) మధ్య దాదాపు 13 ఏళ్ల సుదీర్ఘ విరామం ఉంది. ఆ గ్యాప్ సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీని పెంచింది. కానీ మూడవ భాగం కేవలం మూడేళ్ల వ్యవధిలోనే రావడంతో ఆ స్థాయి ఎగ్జైట్‌మెంట్ కొంత మిస్ అయినట్లు ఆడియన్స్ ఫీల్ అయ్యారు. జేమ్స్ కామెరూన్ అంటేనే విజువల్ వండర్. ప్రతిసారీ ఏదో ఒక కొత్త టెక్నాలజీని పరిచయం చేస్తారు. ఈసారి 'ఫైర్ అండ్ యాష్'లో అగ్ని పర్వతాల నేపథ్యంలో సాగే నావి తెగలను చూపించించారు. వీరు ఇతర నావి తెగల కంటే భిన్నంగా, కొంత క్రూరంగా ఉంటారు.
ఇందులో విలన్ పాత్రే స్పెషల్ అట్రాక్షన్. వరాంగ్ (Varang) అనే పవర్‌ఫుల్ నావి పాత్రలో ఊనా చాప్లిన్ నటించారు. ఈమెను 'ఫాలెన్ నావి' (Fallen Na'vi) అని పిలుస్తారు. కేవలం 15 ఏళ్ల వయసులోనే తన తండ్రిని చంపి, మాంగ్‌క్వాన్ క్లాన్‌కు నాయకురాలిగా మారిన వరాంగ్.. జేక్ సల్లీ కుటుంబానికి ఎలాంటి సవాళ్లు విసురుతుందనేది ఇంట్రెస్టింగ్గా చూపించారు.
అవతార్ 3 కథ:
‘అవతార్ 2’ తర్వాతి సంఘటనలతో అవతార్ 3 కథ ప్రారంభమవుతుంది. పెద్ద కుమారుడి మరణంతో బాధలో ఉన్న జేక్ సల్లీ, నేతిరి తమ కుటుంబంతో కలిసి జీవనం కొనసాగిస్తుంటారు. ఇదే సమయంలో రెండో భాగంలోనే మరణించిన కల్నల్ క్వారిచ్ (స్టీఫెన్ లాంగ్) మళ్లీ తిరిగి వచ్చి సల్లీ కుటుంబంపై ప్రతీకారం తీర్చుకోవాలని డిసైడ్ అవుతాడు.
ఈసారి అతనికి అగ్ని తెగ నాయకురాలు వరంగ్ మద్దతుగా నిలుస్తుంది. ఈవా దేవతపై కోపంతో ఉన్న వరంగ్, ఆధునిక ఆయుధాలతో పండోరా గ్రహంలోని తెగలపై దాడికి సిద్ధమవుతుంది. మరోవైపు ఆర్డీఏ బృందం కూడా పండోరాను నాశనం చేయాలనే లక్ష్యంతో రంగంలోకి దిగుతుంది.
అన్ని వైపుల నుంచి వచ్చిన ప్రమాదాలను జేక్ సల్లీ కుటుంబం ఎలా ఎదుర్కొంది? చివరకు పండోరాను ఎవరు కాపాడారు? అన్నది సినిమాలో మెయిన్ పాయింట్. టెక్నీకల్ విజువల్స్, యాక్షన్ సీన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.
