జమ్మూలో బక్రీద్ సందడి.. జోరుగా పొట్టేళ్ల కొనుగోలు

జమ్మూలో బక్రీద్ సందడి.. జోరుగా పొట్టేళ్ల కొనుగోలు

జమ్మూలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. బక్రీద్ కోసం ఆంక్షలు సడలించారు అధికారులు. దీంతో  ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. జమ్మూలో ఎక్కడ చూసినా బక్రీద్ సందడి కనిపిస్తోంది. ఈద్ కోసం ప్రజలు భారీగా షాపింగ్ చేస్తున్నారు. పొట్టేళ్ల కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. జమ్మూలోని మార్కెట్లన్నీ పొట్టేళ్ల అమ్మకాలతో రద్దీగా మారాయి. బక్రీద్ ను ప్రశాంతంగా జరుపుకుంటామని జమ్మూ ప్రజలు చెబుతున్నారు. అధికారులు కూడా అంతా బాగానే ఉందని చెబుతున్నారు.