ఎండాకాలంలో నేరేడు ఎంతో నయం

ఎండాకాలంలో నేరేడు ఎంతో నయం

ఎండాకాలంలో దొరికే నేరేడు పండ్లు ఆరోగ్యానికి చాలా చాలా మేలు చేస్తాయి అంటున్నారు ఎక్స్‌‌పర్ట్స్‌‌ ఆ లాభాలేంటంటే...నేరేడు పండుతో చేసిన పానీయం తాగితే దగ్గు, గొంతు సమస్యలు లాంటివి ఉండవు. నేరేడు పండ్లలో గింజలు తీసేసి చేతితో పిసికి రసం తియ్యాలి. రసానికి సమానంగా పటికబెల్లం కలిపి పొయ్యిపైన ఓ మాదిరి మంటమీద పెట్టాలి. పాకంలా అయ్యేవరకు వేడిచేయాలి. ప్రతిరోజు అరగ్లాసు నీళ్లలో దాన్ని సగం స్పూన్‌‌ కలుపుకుని తాగితే టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
విరేచనాలు తగ్గేందుకు..
విరేచనాలు తగ్గేందుకు నేరేడు పండు మంచి మందు. నేరేడు పండుతో కషాయం చేసుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది. 50 గ్రాముల నేరేడు పండ్లను తీసుకుని లోపలి గింజలు తీసేయాలి. ఆ తొక్కను నీళ్లలో వేసి, తర్వాత 10 గ్రాముల యాలకుల పొడి, 10 గ్రాముల దాల్చిన చెక్క పొడి కలిపి బాగా మరిగించాలి. నేరేడు చెక్కతో చేసిన కషాయం, మేకపాలు కలిపి తాగితే కూడా విరేచనాలు తగ్గుతాయి.
షుగర్‌‌‌‌ కంట్రోల్‌‌
నేరేడు గింజల పొడి షుగర్‌‌‌‌ని కంట్రోల్‌‌ చేయడంలో బాగా ఉపయోగపడుతుంది. నేరేడు గింజల్ని  దోరగా వేగించి పొడి చేయాలి. ఈ పొడిని రోజూ నీటిలో కలిపి కాచి పాలు,  తాటి కలకండ కలిపి కాఫీలాగ రెండు పూటలా తాగితే డయాబెటిస్, అతి మూత్ర సమస్యలు కంట్రోల్‌‌లో ఉంటాయి.
ఇవీ లాభాలు..
ఎండాకాలం సీజన్​లో అల్ల నేరేడు పండ్లను రోజూ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాకుండా చాలా శుభకార్యాల్లో అల్ల నేరేడు ఆకులను ఇంటికి కడతారు. అలా కడితే సూక్ష్మక్రిములు దరిచేరవు.ఇది లివర్‌‌‌‌కు కూడా చాలామంచిది. కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నివారిస్తుంది.  కడుపులో  వెంట్రుకలు, లేదా గట్టి పదార్థాలేవైనా ఉంటే కరిగిస్తాయి నేరేడు పండ్లు.  పంటి సమస్యలు, చిగుళ్ల నొప్పితో బాధపడేవారు నేరేడు పుల్లతో పళ్లు తోమితే పంటి సమస్యలు పోతాయి. నేరేడు ఆకుల రసాన్ని నోట్లో వేసుకుని పుక్కిలిస్తే నోటికి మంచిది. చెట్టు ఆకులు ఎండబెట్టి పొడిచేసి వాటిల్లో కొద్దిగా ఉప్పు కలుపుకుని బ్రష్ చేస్తే పళ్లు గట్టిపడతాయి. -నేరేడు పండు తినడం వల్ల కడుపులో నులిపురుగుల లాంటివి కూడా చచ్చిపోతాయి.  మూత్రాశయ,  నోటి క్యాన్సర్​కు టానిక్​లా  పనిచేస్తుంది. ఇందులో విటమిన్ – ఏ,  సి ఎక్కువగా ఉంటాయి.  దెబ్బలు తగిలినప్పుడు వాటిపై నేరేడు ఆకులతో కట్టుకడితే గాయం తాలూకు మచ్చలు పడవు.  నేరేడు పండు రసంలో కొంచెం తేనె కలిపి తాగితే అరికాళ్లు, అరిచేతుల  మంటలు, మూత్ర సంబంధిత వ్యాధులు తగ్గుతాయి.

నేరేడు మంచి మందు
నేరేడు పండ్లలో అనేక ఔషధ గుణాలున్నాయి. ఇది తినడం వల్ల షుగర్‌‌, మూత్ర, కిడ్నీలకి సంబంధించిన రోగాలు తగ్గిపోతాయి. నీళ్ల విరేచనాలు లాంటి వాటికి మంచి మందు నేరేడు.                                   – డాక్టర్​ హరినారాయణ, జనరల్​ ఫిజీషియన్