V6 News

జనసేన పార్టీకి హీరో నితిన్ రూ.25 లక్షల విరాళం

జనసేన పార్టీకి హీరో నితిన్ రూ.25 లక్షల విరాళం

హీరో నితిన్ జనసేన పార్టీ ఫండ్ కు రూ.25 లక్షలు విరాళం ఇచ్చాడు. మంగళవారం భీమవరంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రచారం నిర్వహిస్తుండగా.. నితిన్ తండ్రి, నిర్మాత ఎన్. సుధాకర్ రెడ్డి  పవన్ కు చెక్ అందచేశారు. డీ హైడ్రేషన్ తో అస్వస్థతకు లోనైన పవన్ కళ్యాణ్  ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు నితిన్ తండ్రి.

పవన్ కళ్యాణ్  మాట్లాడుతూ “సోదరుడు నితిన్ నా ఆరోగ్యం గురించి వాకబు చేసినందుకు సంతోషంగా ఉంది. ఎంతో అభిమానంగా జనసేనకు విరాళం పంపించారు. నితిన్ కు,  సుధాకర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు”  తెలిపారు పవన్.