జపాన్​ పాస్​ పోర్ట్ ప్రపంచంలో శక్తివంతమైంది

జపాన్​ పాస్​ పోర్ట్ ప్రపంచంలో శక్తివంతమైంది

విదేశాలకు వెళ్లాలంటే వీసా తప్పనిసరి…. వీసా కావాలంటే పాస్ పోర్ట్ ఉండాలి.  అయితే వీసా లేకుండా ..కేవలం పాస్ పోర్ట్ లతో కొన్ని దేశాలకు వెళ్లొచ్చు. వెళ్లాక అక్కడే నేరుగా వీసా తీసుకోవచ్చు. ఆ లిస్టులో ఎప్పటి లాగానే జపాన్ పాస్ పోర్ట్ మొదటి స్థానంలో నిలిచింది. హెన్లీ అండ్ పార్ట్ నర్స్ విడుదల చేసిన అత్యంత శక్తిమంతమైన పాస్ పోర్ట్స్ జాబితాలో జపాన్ ముందు నిలిచింది. ఆ పాస్ పోర్ట్ తో ముందస్తు వీసా లేకుండానే 191 దేశాలకు వెళ్లవచ్చు.

ఈ లిస్టులో భారత్ పాస్ పోర్ట్ 85వ ర్యాంకును సాధించింది. మన పాస్ పోర్ట్ తో ముందస్తు వీసా లేకుండా 58 దేశాలకు వెళ్లొచ్చు. గతేడాది 84వ స్థానంలో ఉండగా.. ఇప్పుడు ఓ స్థానం కిందకు పడిపోయింది. ఇండియాతో పాటు తజకిస్థాన్ కూడా 85వ ప్లేస్ లో ఉంది.

మెదటి 10 దేశాల్లో జపాన్ మొదటి స్థానంలో ఉండగా…190 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం ఉన్న సింగపూర్ పాస్ పోర్ట్ రెండో స్థానాన్ని దక్కించుకుంది. జర్మనీ, దక్షిణ కొరియా (189) మూడు, ఫిన్లాండ్, ఇటలీ, లగ్జెంబర్గ్, స్పెయిన్ (188) నాలుగో స్థానం, ఆస్ట్రియా, డెన్మార్క్ (187) ఐదో స్థానంలో నిలిచాయి. ఆరో స్థానంలో ఫ్రాన్స్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, పోర్చుగల్, స్వీడన్ (186), ఏడో స్థానంలో బెల్జియం, న్యూజిలాండ్, నార్వే, స్విట్జర్లాండ్, బ్రిటన్, అమెరికా (185), ఎనిమిదో స్థానంలో ఆస్ట్రేలియా, చెక్ రిపబ్లిక్, గ్రీక్, మాల్టా (184), తొమ్మిదో స్థానంలో కెనడా (183), పదో స్థానంలో హంగరీ (182) నిలిచాయి.