జవాన్లకు రిస్క్​ అలవెన్స్ 78 % పెంపు

జవాన్లకు రిస్క్​ అలవెన్స్ 78 % పెంపు

న్యూఢిల్లీ: మొన్నటికి మొన్న జమ్మూకాశ్మీర్ లో పనిచేసే జవాన్లకు ఫ్రీగా విమాన ప్రయాణాన్ని ప్రకటించిన కేంద్రం.. తాజాగా రిస్క్​ అండ్ హార్డ్​షిప్ అలవెన్స్ (ఆర్ హెచ్​ఏ)ని భారీగా పెంచింది. ఇప్పుడిస్తున్న దానికి 78 శాతాన్ని పెంచుతూ కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుంది. గతంలో ₹9,700 ఆర్ హెచ్​ఏ ఇస్తుండగా.. దానిని ₹17,300కు పెంచింది. ఇన్ స్పె క్టర్ ర్యాంకుల వరకు ఈ పెంపు వర్తిస్తుంది. ఇన్ స్పె క్టర్ పైబడిన ర్యాంకుల వారికిస్తున్న ₹16,900 ఆర్ హెచ్​ఏని ₹25 వేలకు పెంచింది. అందుకు అనుగుణంగా జమ్మూకాశ్మీర్ లోని అనంతనాగ్​, కుల్గాం , షోపియాన్ , పుల్వామా, బద్గాం , గందె ర్బల్, బారాముల్లా, కుప్వారా, బందీ పొరా, శ్రీనగర్ జిల్లాలను ముప్పు ఎక్కువున్న జాబితాలో చేర్చుతూ 22న నిబంధనలను కేంద్రం సడలించింది.

దీంతో 55 వేల మంది లబ్ధి పొందనున్నారు. ‘ఉగ్రవాదులతో పోరులో భద్రతా బలగాలు ఎదుర్కొంటున్న కష్టనష్టాలను కేంద్రం గుర్తించింది’ అని ఓ సీఆర్ పీఎఫ్ అధికారి అన్నారు. వారితో పాటు నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో పని చేసే వారికీ అలవెన్సును వర్తిం పజేయనుంది. ఛత్తీస్ గఢ్ లోని బస్తర్, దంతెవాడ, బీజా పూర్ , సుక్మా, నారాయణపూర్, జార్ఖండ్ లోని లతేహర్ , మహారాష్ట్రలోని గడ్చిరోలి, ఒడిశాలోని మల్కాన్ గిరి జిల్లాలనూ ముప్పు ఎక్కువున్న జాబితాలో చేర్చింది. ఈ నిర్ణయంతో 33 వేల మంది సీఆర్పీ ఎఫ్ జవాన్లకు లబ్ది చేకూరనుంది