జెఫ్ బెజోస్ వాషింగ్టన్ పోస్ట్‌ను అమ్మేస్తున్నారా..?

జెఫ్ బెజోస్ వాషింగ్టన్ పోస్ట్‌ను అమ్మేస్తున్నారా..?

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ అమెరికన్ న్యూస్ పేపర్ వాషింగ్టన్ పోస్ట్ ను అమ్మేసేందుకు ప్లాన్ చేసినట్టు న్యూయార్క్ పోస్ట్ ఓ కథనం ప్రచురించింది. ఫుట్ బాల్ టీమ్ వాషింగ్టన్ కమాండర్స్ ను కొనుగోలు చేయడానికే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారంటూ వెల్లడించింది. అయితే ఈ వార్తలను బెజోస్ అధికార ప్రతినిధి ఖండించారు. వాషింగ్టన్ పోస్ట్ ను అమ్మడం లేదని స్పష్టం చేశారు. బెజోస్ వాషింగ్టన్ పోస్ట్‌ను 2013లో 250 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు.

అయితే న్యూస్ పేపర్ ను సొంతం చేసుకోవడం అనేది తన లక్ష్యం కాదని ఇటీవల జెఫ్ బెజోస్ వ్యాఖ్యానించారు. తనకు ఫుట్ బాల్ అంటే చాలా ఇష్టమని వెల్లడించారు. అయితే జాతీయ ఫుట్ బాల్ జట్టును సొంతం చేసుకోవాలన్న విషయంపై మాత్రం ఆయన స్పందించలేదు. దీంతో ఆయన వాషింగ్టన్ పోస్ట్ ను నిజంగానే అమ్ముతారా? లేదా? అనే విషయం సందిగ్ధంలో ఉంది.