Pak vs Ind: నా సూపర్ బ్యాటింగ్‌కి కారణం కొహ్లీ

Pak vs Ind: నా సూపర్ బ్యాటింగ్‌కి కారణం కొహ్లీ

మహిళల టీ20 వరల్డ్ కప్ లో భాగంగా కేప్‌టౌన్‌లో జరిగిన భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌లో టీమిండియా ఆరు బంతులు మిగిలుండగానే 150 పరుగుల లక్ష్యాన్ని చేదించింది. 38 బంతుల్లో 53 పరుగులు చేసిన జెమిమా రోడ్రిగ్స్ మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడింది. మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడిన రోడ్రిగ్స్ తన సూపర్ బ్యాటింగ్‌కి కారణం విరాట్ కొహ్లీ అని తెలిపింది. విరాట్ ఇచ్చిన స్పూర్తితో బ్యాటింగ్ చేయగలిగానని చెప్పింది.

‘ఎంసీజీ స్టేడియంలో పాకిస్తాన్‌పై విరాట్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ నాలో స్పూర్తి నింపింది. క్రీజులో ఉన్న టైంలో విరాట్ ఆడిన నాక్ గుర్తుచేసుకున్నా. ఒత్తిడిలో అతను చేసిన బ్యాటింగ్ నాలో ప్రేరణ కలిగించింది. నేను ఆడిన గత 10 మ్యాచుల్లో చేసింది 30 పరుగులే. ఫామ్ కోల్పోయినా నన్ను నమ్మి ప్లేయింగ్ 11లో చాన్స్ ఇచ్చారు. అప్పుడే ఈ మ్యాచ్ ఎలాగైనా గెలిపించాలనుకున్నా. జట్టుకు అవసరమైనప్పుడే మనం ఏంటో నిరూపించుకోవాలి’ అని చెప్పింది.