తప్పుచేస్తే నన్ను అరెస్ట్ చేయండి: సీఎం హేమంత్ సోరెన్

తప్పుచేస్తే నన్ను అరెస్ట్ చేయండి: సీఎం హేమంత్ సోరెన్

జార్ఖండ్ లో సీఎం హేమంత్ సోరెన్ కు మద్దతుగా జేఎంఎం కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ ప్రభుత్వం సోరెన్ సర్కార్ ను కావాలనే ఇరకాటంలో పెడుతోందని ఆరోపించారు. బీజేపీయేతర రాష్ట్రాలను కేంద్రం టార్గెట్ చేస్తోందని మండిపడ్డారు. హేమంత్ సోరెన్ తప్పు చేస్తే ఎందుకు అరెస్ట్ చేయడం లేదని నిలదీశారు. మైనింగ్ కేసులో ఈడీ సమన్లు మాత్రమే జారీ చేసిందని చెప్పారు జేఎంఎం కార్యకర్తలు.

అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్ఘండ్ సీఎం హేమంత్ సోరెన్ రాంచీలోని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరయ్యారు. ఈనెల 3న ఈడీ ముందు సోరెన్ హాజరుకాకపోవడంతో ఆయనకు సమన్లు జారీ చేశారు. సమన్లను మూడు వారాలకు వాయిదా వేయాలని కోరారు. కానీ ఈడీ అధికారులు అందుకు నిరాకరించారు. కావాలనే కుట్రలో భాగంగానే ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు విచారణకు పిలిచారని..తాను అక్రమాలకు పాల్పడితే  అరెస్ట్ చేయాలన్నారు. తప్పుచేయనప్పుడు తాను ఎవరికీ భయపడనని..ఆందోళన చెందనవసరం లేదని చెప్పారు.