- 71 మందికి గోల్డ్ మెడల్స్
కూకట్పల్లి, వెలుగు: జేఎన్టీయూ14వ స్నాతకోత్సవాన్ని శనివారం నిర్వహించనున్నట్లు వీసీ డాక్టర్ టి. కిషన్‌కుమార్ రెడ్డి తెలిపారు. వర్సిటీ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. 14వ స్నాతకోత్సవం సందర్భంగా మొత్తం 82,547 మంది విద్యార్థులకు యూజీ, పీజీ, పీహెచ్డీ పట్టాలు, 71 మందికి గోల్డ్ మెడల్స్ అందజేయనున్నట్లు వివరించారు. వర్సిటీలో పరిపాలన సౌలభ్యం కోసం అనేక సంస్కరణలు ప్రవేశపెట్టినట్లు వివరించారు.
అన్ని యూజీ, పీజీ విభాగాల్లో పరిశ్రమ నిపుణులు, అలుమ్ని, ప్రముఖ సంస్థల ప్రతినిధులతో కొత్త బోర్డ్స్ ఆఫ్ స్టడీస్ ప్రవేశపెట్టామని తెలియజేశారు. దీంతో పాటు అన్ని విభాగాల అభివృద్ధి, విద్యా బోధన, ప్లేస్‌మెంట్స్‌కు సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిందన్నారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె. వెంకటేశ్వరరావు, రెక్టార్ డాక్టర్ కె. విజయకుమార్ రెడ్డి పాల్గొన్నారు.
