హైదరాబాద్ సిటీ, వెలుగు : జూన్ 1న మెహిదీపట్నంలోని పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నంబర్ 67కు సమీపంలోని కింగ్స్ ప్యాలెస్‌లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు నిర్వాహకుడు మన్నన్ ఖాన్ తెలిపారు.
అభ్యర్థులు కనీసం పది పాసై ఉండాలన్నారు. ఫార్మా, హెల్త్ కేర్, ఐటీ అండ్ ఐటీఈఎస్, ఎడ్యుకేషన్, బ్యాంకింగ్ వంటి రంగాలకు చెందిన కంపెనీలు వస్తాయన్నారు. ఇందులో చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పిస్తున్నాయని తెలిపారు. వివరాల కోసం 8374315052 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
