పరుగుల చిరుత.. సోలపోగుల రాములు

పరుగుల చిరుత.. సోలపోగుల రాములు

బోర్లా వడ్డ పడవ మీద తేలుకుంటూ వచ్చిన ఆపిలగాళ్లు.. ఒడ్డు రాగానే అవతలికి దునికినరు.ఏడ్చుకుంట పక్కనే ఉన్న కొండెక్కిన్రు. వీళ్ల అరుపులు, ఏడ్పులను కలప స్మగ్లర్ లు విన్నరు.‘ఎవర్రా మీరు?’ అని బెదిరించినరు. ‘ మా పడవ మునిగిపోయింది. మా వాళ్లం తా సచ్చిపోయిన్రు’అన్నారు. అప్పుడు ఫోన్లు లేవు. అక్కడున్నఆఫీసర్లు అప్పటి సీఎం ఎన్టీ రామారావుకు ప్రమాదం గురించి చెప్పిన్రు. ఆయన వెంటనే హెలికాప్టర్‌ పంపిండు. అట్ల బతికి బట్టకట్టిన సోలపోగుల స్వాములు ఎవరూ ఊహించనత్త ఎత్తుకు ఎదిగిండు!

బస్సు కంటే ఫాస్టుగా ఉరికిండు

‘జోగులాంబ జిల్లా.. అలంపూర్‌ తాలుక బుక్కాపురం మాది. నాయిన ఈదన్న.. అమ్మ సవారమ్మ. మాకు భూమి జాగ లేదు. కృష్ణానది పొంటి పది కిలోమీటర్ల దూరం పోయి..కట్టెలు కొట్టుకొ చ్చి అమ్మేటోళ్లు. వాళ్ల జీన్స్‌వల్లనే నేను ఇంత గట్టిగా ఉన్ననేమో’ అంటడు స్వాములు. ముగ్గు రు ఆడిపిల్లల తర్వాత పుట్టిండు స్వాములు.1986లో ఎండాకాలంలోవాళ్ల ఊరోళ్లు ఒక పోటీ పెట్టిన్రు.‘తుంగభద్రానది దాటుకుని మన ఊరికి బస్సు కన్నాముందు ఉరికితే వెయ్యి రూపాయల బహుమతి ఇస్తం’ అన్నరు. అప్పట్లో అది పెద్ద ఎమౌంటే! బస్సు కన్నా ఫాస్ట్‌‌గా ఉరుకుడు అంటే కూడాపెద్ద పోటే! తుంగ భద్ర నది అవతల స్వాములు ఉరుకుడు షురూ చేసిండు. ఎవ్వరూ ఊహించని విధంగా.. బస్సుకన్నా ముందే ఊరికి చేరి ‘అరే..వీడు బస్సు కంటే ముందే ఉరికొచ్చిండురా’అని ఆ ఊరి జనమంతా స్వాములుని భుజాలమీద ఎత్తుకుని ఊరేగించిన్రు. అప్పుడు అది ఆ మండలంలో సంచలనం.

నా కోసమొచ్చి మా అక్క..

‘అప్పుడు బస్సుని దాటుకుని వచ్చిన కదా?అప్పటి సంది సరే.. ఇప్పుడు ఇది ముట్టుకోరా..అది ముట్టుకోరా అని అందరూ నన్నుటెస్ట్‌‌ చేసేటోళ్లు. నేను దాన్ని చాలెంజ్‌ గాతీసుకు నేటోన్ని . అప్పట్ల మా ఊర్ల కల్లు లారీ ఫేమస్‌‌. పట్నం నుంచి రోజూ మా ఊరికి వస్తుండె. అది పోతుంటే దమ్ముంటే దాన్ని టచ్‌చేసి రారా అని దోస్తులు అనేసరికి నేను ఉరికిదాన్ని టచ్‌ చేసిన. టచ్‌ చేసి ఆగకుండా దానిమీదికెక్కిన కూడా. ఎక్కినోన్ని దిగాలిగా? దునికి కిందవడే సరికి.. తలకాయ పగిలింది. 1987లో సంక్రాంతి మూడు రోజులకు ఇది జరిగింది.42 కుట్లు పడ్డయ్‌ . నాకు దెబ్బ తాకిందని చూసిపోతానికి అప్పటికే పెండ్లైన మా పెద్ద అక్కవచ్చింది. దెబ్బ తగిలిన మూడు రోజులకే పడవమునిగింది. నన్ను చూస్తానికి రాకపోతే.. మాఅక్క మాతోని జాతరకు రాకపోవు’అని గతాన్నిగుర్తు చేసుకుండు స్వాములు.

కల్వకుర్తి స్కూలే మలుపు

‘కల్వకుర్తిలో మా పీఈటీ మేషక్‌ బాబు సారు పంద్రాగస్టుకు ఆటల పోటీలు ఆడిచ్చిండు. నేను రన్నింగ్‌ లో ఫస్ట్‌‌ వచ్చిన. నా మీద జరఫోకస్‌‌ పడ్డది సార్‌ కు . అట్ల డిస్ట్రిక్‌ లెవల్‌ కు తీస్కపోయిండు. నేను ఐదో తరగతిలో ఉన్నప్పుడే పదో తరగతి పిల్లల దాంట్లో గెలిసిన. అట్లనన్ను స్టేట్‌ లెవల్‌ కు తీస్కపోయిండు. అక్కడగెలిసిన. నేషనల్‌ గేమ్స్‌ లో ఐదో తరగతిలోఉన్నప్పుడు 14 ఏండ్ల కేటగిరిలో నేషనల్స్‌ లోరన్నింగ్‌ గోల్డ్‌‌ కొట్టి న. అప్పుడు మనకు డీఆర్‌గార్గ్‌‌ అని స్పోర్ట్స్‌ సెక్రెటరీ ఉండె. మా పీడీలుమేషక్‌ సార్‌ , ఆదిబాబు సార్‌ నా గురించి చెప్పడంతో.. ఆయన (గార్గ్‌‌) స్పోర్ట్స్‌ అథారిటీఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ లో చేరిపించి .. నన్నుఎల్‌ బీస్టేడియంలో ఇడిసిపెట్టిండు.

సదువూ.. ఆటలు..

‘రోజూ ఎల్‌ బీ స్టేడియంల ప్రాక్టీస్‌‌ చేస్తనే… పక్కనే ఉన్న సుజాత స్కూల్‌ కి వెళ్లేవాన్ని. పరీక్షలు మాత్రం కల్వకుర్తి కి వెళ్లిరా సొచ్చేటోడిని. ఇగ ఎక్కడ పోటీ జరిగినా వెళ్లేటోన్ని’ అని చెప్పిండాయన. వరల్డ్‌ బెస్ట్‌ రన్నర్‌ ‘హుస్సేన్‌ బోల్ట్‌‌’తో నన్ను పోల్చేవాళ్లు.అతడిని ఎక్కడ దింపిన గోల్డ్ కొట్టుకు రావడం ఖాయం!1995 నుంచి 2004 వరకుజిల్లాస్థా యి 400 మీటర్ల పరుగు పందెంలో ఏడుసార్లు గోల్డ్‌‌ కొట్టిండు . 1995 నుంచి 2002 వరకు రాష్ట్ర స్థాయిలో కూడా 400 మీటర్ల విభాగంలో ఏడుసార్లు ఛాంపియన్‌‌గా నిలిచిండు . 1996 కర్ణాటక బెంగళూరులోజరిగిన ఆల్‌ ఇండియా అథ్లెటిక్స్‌ పోటీల్లో..400మీటర్ల విభాగంలో ఏపీకి బంగారు పతకం అందించిండు. ఇదే ఈవెంట్‌ లో 4×4రిలే పరుగు పందెంలో బంగారు పతకం గెలుపొందిండు. 2002 హైదరాబాద్‌ లోజరిగిన నేషనల్‌ గేమ్స్‌ లో ఉత్తమ అథ్లెట్‌ గానిలిచిండు . జాతీయ స్థా యి మొత్తంలో ఎనిమిదిగోల్డ్‌‌లు తెచ్చిండు స్వాములు. పీటీ ఉష, అశ్వనీనాచప్ప, స్వాములుకి సీనియర్లు. వీళ్లంతా స్పోర్ట్‌‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా హాస్టల్‌ లోఉండేవాళ్లంట.

ఇంటర్నేషనల్‌ కు పోలేకపోయిండు

‘ఇంటర్నేషనల్‌ పోలె. నా వెనుక ఏం లేదుకదా? ఎంత ప్రతిభ చూపినా..క్యాంపులకు పోకుంటే సెలక్ట్‌‌ చెయ్యరు. ట్రైన్‌‌కి డబ్బులులేక కొన్ని నేషనల్స్‌ కి కూడా పోలె. అప్పుడు ఫండింగ్‌ లేదు. నాకు స్పాన్సర్ స్‌ కూడా లేకుండె.అక్కల పెండ్లి చెయ్యాలనే బాధ్యత ఊకేగుర్తొచ్చేది. పద్దెనిమిదేళ్లకే రైల్వేలో గ్రూప్‌ 4జాబ్‌ వచ్చింది. వాళ్ల కోసం ఆ జాబ్‌ చేస్తూనే ఆటలు ఆడేటోన్ని. తర్వాత ఆర్టీసీలో జాబ్‌వచ్చింది. ఇటు బాధ్యతలు.. బయట పరిస్థితులు అనుకూలించలె’ అన్నడు స్వాములు. ఒకవైపు ఆటలు, ఉద్యోగం కొనసాగిస్తూనే డిస్టెన్స్‌ లో  ఆటల విభాగంలో పీహెచ్‌ డీ పూర్తి చేసిండు.2006లో స్వాములు పెండ్లి చేసుకుండు. భార్యనవనీత కూడా టీచర్‌ . ఆరేళ్ల ఆయన కూతురుసాయి శాన్వి జిమ్నాస్టిక్ స్‌ లో మెరుస్తోంది. 2008డీఎస్సీతో పీఈటీ ఉద్యోగం సాధించి మేకగూడగవర్నమెంట్‌ స్కూల్‌ లో పదేండ్లు పని చేసిండు.

ఆటకు దూరమైండు

2002 నేషనల్‌ గేమ్స్‌ తర్వాత స్వాములుమరో జాతీయ పతకం సాధించలేదు. తనపెండ్లి నాటికి నెమ్మదిగా ఆటకు దూరమైండు.‘బాధ్యతలు పెరిగినయ్‌ , ఏజ్‌ కూడా మీదవడ్డది. మోకాళ్లు పగిలిపోయినా .. మోటుగా ఉరికిన. రోజుకు 20 కిలోమీటర్లు ఉరికేది.మోకాళ్ల చిప్పలు అరిగిపోయినయ్‌ . దీంతో ఆటనుంచి తప్పుకోవాల్సిన పరిస్థి తి ఏర్పడింది’ అనిచెప్పిండు స్వాములు.

పేద పిల్లల ద్రోణాచార్యుడు

‘ప్రతిభ ఉండి కూడా బయటకు రాని పిల్లలను తీర్చిదిద్దాలనే పీఈటీ జాబ్‌ కొట్టి న. నేను అనుకున్నట్టే నా స్టూడెంట్ స్‌ నా కన్నా మెరుగ్గారాణిస్తున్నరు. నా పిల్లలు ఏ స్థా యికి వెళ్లిననా పిల్లలే’ అన్నడు స్వాములు నవ్వుకుంటూ..స్వాములు శిక్షణలో రాటుదేలిన లాల్‌ సింగ్‌ ,గౌతమి జాతీయ స్థా యి రన్నింగ్‌ పోటీల్లోపసిడి పంట పండించారు. స్కూల్లనే కాకుండానారాయణపేట, గద్వాల, కొల్లా పూర్‌ ,ఆలంపూర్‌ , షాద్‌ నగర్‌ ప్రాంతాల నుంచి వచ్చేవందలాది స్వాములు వద్ద శిక్షణ పొంది ఆర్మీ,ఎస్‌‌ఐ, కానిస్టేబుల్‌ కొలువుల్లో సెటిల్‌ అయినరు.ఇతని సేవలు గుర్తించిన ‘సోషల్‌ వెల్ ఫేర్‌ ’సెక్రెటరీ ఆర్‌ ఎస్ ప్రవీణ్ కుమార్‌ … స్వాముల్నిడిప్యూటేషన్‌‌ మీద ‘సోషల్​ వెల్ ఫేర్’ స్టేట్‌అసిస్టెం ట్‌ స్పోర్ట్స్‌ ఆఫీసర్‌ గా నియమించిండు.తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేద విద్యార్థుల్లో ఉన్నక్రీడా ప్రతిభను వెలికి తీసే బాధ్యత తీసుకున్నడు స్వాములు! అదృష్టవశాత్తు పడవ ప్రమాదం నుంచి బయటవడ్డ స్వాములు ఉన్నత స్థానాలకు చేరిండు. ‘పట్టుదలతోటి, కసితో ప్రాక్టీస్‌‌ చేస్తే..ఏదైనా సాధిస్తాం. ఫస్ట్‌‌ భయాన్ని తీసేయాలె. ఇదే ఇప్పటోళ్లకు నేనిచ్చే సలహా’ అంటాడాయన.

అనాథగా మారిండు

‘అందరం సంతోషంగ పడవల పోతున్నం.. నడి మధ్యలకు పోంగనే పడవబోల్తా వడ్డది. నీళ్ల అడుగున మా వాళ్లు. మునిగిన పడవ బోర్లా తేలింది. నేను ఇంకో పిలగాడు ఇద్దరం ఎగిరి దాని మీద పండుకున్నం. దాన్ని గట్టిగా కరుసుకున్నం. అట్ల తేలుతూ శ్రీశైలం అడవులకు కొట్టు కుపోయినం. ఒడ్డురాంగనే ఎమ్మటే దునికినం’ అని అప్పుడు జరిగిందాన్ని గుర్తు చేసుకున్నడు స్వాములు. ఆ ప్రమాదంలో స్వాములు అమ్మా, నాయిన, అక్కతో పాటు మొత్తం 27 మంది చని పోయినరు. ఇద్దరు అక్కలు, స్వాములు అనాథలు అయినరు. ‘పడవ ప్రమాదంలో చనిపోయిన తల్లిదండ్రుల పిల్లలందరిని ఆలంపూర్‌ గవర్నమెంట్ ఎస్సీ హాస్టళ్ల ఇడిసింది. అందులో నేను 4 తరగతి వరకు చదువుకున్న. అంతకు ముందు నేను చదవలే.మేకలు కాసేది. ఆ హాస్టల్‌ ఇడవంగనే.. నాకంటూ ఎవరూ లేకున్నా ..అక్కొడోళ్లందరి కంటే పెద్ద ఏజ్‌ ఉన్నగానీ మంచిగా సదువుకున్నా .అయితే, ఎండాకాలం నాకు ఎక్కడికి పోవాలన్నా .. ఇబ్బందే?.. మా అక్కలకు పెండ్లీలు కూడా కాలె. ఊళ్లెకు పోతే నేనే వాళ్లకు పెద్ద ఆటంకం. నేను వాళ్లకు మొకం చూపించ లేకుంటి . అప్పుడుహైదరాబాద్‌ లోని సంతోష్ నగర్‌ లో అడ్డా కూలీగా నిలవడేది.ఇటుకలు మోసిన. కల్వకుర్తి నుంచి వచ్చే ఇసుక లారీల్లో ఇసుక తోడే పనిచేసిన. ఒకవేళ ఇంటికి పోతే.. బుడ్డలు తీయబోయేది. వ్యవసాయ పనులన్నిటికి పోయేటోన్ని . నాలుగో తరగతిలో ఉన్నప్పుడు మా సార్లు‘సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియ్‌ ల్ స్కూల్‌ ’కు పరీక్ష రాయించినరు. అందులో సెలక్టై కల్వకుర్తి రెసిడెన్షియల్‌ స్కూల్‌ లో చేరిన.