గద్వాల, వెలుగు: ఐదో శక్తిపీఠం జోగులాంబ అమ్మవారి టెంపుల్ వివాదాలకు కేరఫ్‌గా నిలుస్తున్నది. ఐటీ కేసులో జోగులాంబ టెంపుల్ పూజారిని హైదరాబాద్ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. గతంలో పూజారి సోషల్ మీడియాలో ఈవో లీలలు అంటూ వీడియో రిలీజ్ చేశాడు. దీనిపై ఎండోమెంట్ ఆఫీసర్లు కంప్లైంట్ చేయడంతో హైదరాబాద్లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఎంక్వైరీలో భాగంగా సోమవారం ఆలంపూర్ చేరుకొని పూజారిని అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవాలయంలో పూజల వ్యవహారంలో గొడవ జరిగింది.
ఇద్దరు పూజారులతోపాటు మరో బయట వ్యక్తి తీవ్ర స్థాయిలో ఘర్షణ పడడం ఆందోళన కలిగిస్తోంది. ఈ విషయంపై ఓ పూజారి పోలీసులకు కంప్లైంట్ చేయడంతో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ విషయంపై అలంపూర్ ఎస్సై రామకృష్ణ మాట్లాడుతూ సోమవారం హైదరాబాద్ కు చెందిన పోలీసులు పూజారిని అదుపులోకి తీసుకున్నారన్నారు. ఆదివారం జరిగిన ఘటనపై ఫిర్యాదు అందిందని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
