సింగిల్ డోస్ టీకాకు అనుమతివ్వాలన్న జాన్సన్ & జాన్సన్

 సింగిల్ డోస్ టీకాకు అనుమతివ్వాలన్న జాన్సన్ & జాన్సన్

కరోనా వైరస్ వ్యాప్తి కేసుల సంఖ్య తగ్గుతున్నట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. ప్రపంచంలోని పలు దేశాల్లో ఇంకా పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా జోరుగా కొనసాగుతోంది. పలు కంపెనీలు తయారు చేసిన వ్యాక్సిన్ లు ప్రజలకు అందిస్తున్నారు. కోవాగ్జిన్, కోవీషీల్డ్ టీకాలను అందిస్తోంది. అయితే..కొన్ని వ్యాక్సిన్ లు రెండు డోస్ లు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. తాజాగా…సింగిల్ డోస్ వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ప్రభుత్వం అనుమతినిస్తే…అత్యవసర వినియోగానికి ఈ వ్యాక్సిన్ ఉపయోగించే వీలు ఉంది.

కరోనా వ్యాక్సిన్ తయారులో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ నిమగ్నమైంది. అమెరికాకు చెందిన ఈ సంస్థ…తాజాగా సింగిల్ డోస్ తయారు చేసింది. 'జాన్సెన్' పేరిటతో తయారు చేసిన ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతినివ్వాలంటూ…శుక్రవారం దరఖాస్తు చేసుకుంది. గతంలో ఈ సంస్థ భారతదేశంలో ప్రయోగాల కోసం దరఖాస్తు చేసుకుని..చివరి నిమిషంలో ఉపసంహరించుకుంది.

ఇప్పటికే పలు దేశాలు అనుమతించిన ప్రముఖ వ్యాక్సిన్లను ట్రయల్స్ అవసరం లేకుండానే…అత్యవసర వినియోగానికి అనుమతించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. పాత దరఖాస్తును ఉపసంహరించుకున్న తర్వాత తాజాగా..అత్యవసర వినియోగం కోసం మరోసారి దరఖాస్తు చేసుకుంది. భారతదేశ ప్రజలకు సింగిల్ డోస్ వ్యాక్సిన్ అందించే దిశగా…చాలా ముఖ్యమైందిగా తెలిపింది.