అభిమానుల్ని అట్రాక్ట్ చేస్తున్న “జోకర్ ” షూటింగ్ స్పాట్స్

అభిమానుల్ని అట్రాక్ట్ చేస్తున్న “జోకర్ ” షూటింగ్ స్పాట్స్

జాక్విన్ ఫోనిక్స్ లీడ్ రోల్ లో, టాడ్ ఫిలిప్స్ డైరక్టర్ గా యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన చిత్రం జోకర్. జోకర్  సినిమా వసూళ్లతో భాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లతో సంచలనం సృష్టిస్తుంది. వరల్డ్ వైడ్ గా హైయ్యస్ట్ గ్రాస్ వసూల్ చేసిన చిత్రంగా  నిలిచింది. బాక్సాఫీజ్ మోజో కలెక్షన్ ప్రకారం ఇప్పటి వరకు రూ. 52,57,82,49,774.6 వసూలు చేసినట్లు తెలుస్తోంది.

ఓ మహనగరంలో యువకుడు ఫ్లెక్ (జాక్విన్ ఫోనిక్స్ ) జోకర్ గా యాక్ట్ చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తుంటాడు.  యువకుడికి అదే నగరంలో టాప్ కమెడియన్ గా చెలామణి అవుతున్న ముర్రే ఫ్రాంక్లిన్ (రోబర్ట్ డీ నిరో) రేంజికి  ఎదగాలని ఫ్లెక్ కలలు కంటుండాడు. కానీ బ్యాడ్ లక్ వెంటాడడంతో  గొప్ప నటుడు కాలేక చివరికి జోకర్ గా మిగిలిపోతాడు. జోకర్ గా మారిన తరువాత సమాజం పై , జీవితంపై విరక్తి పుట్టి ఫ్లెక్ విలన్ మారతాడనేది స్టోరీ.

జోకర్ క్యారక్టర్ ఎందుకు ఇంత పాపులర్ అయ్యిందనే విషయాన్ని సింగిల్ లైన్ లో చెప్పలేకపోవచ్చు. కానీ ఈ సినిమాలో ఫ్లెక్ హై క్యారక్టర్ ఫర్మామెన్స్, కూల్ అండ్ కాంప్లెక్స్ యాటిట్యూడ్ వల్ల  సినిమాకు అభిమానులు జేజేలు కొడుతున్నారు. దీంతో ఈ సినిమా షూటింగ్ జరిగిన ప్రదేశాలు టూరిస్ట్ లకు ఫేవరేట్ స్పాట్ గా నిలిచిపోతున్నాయి. ముఖ్యంగా ఫ్లెక్ క్యారక్టర్ లో జాక్విన్ ఫోనిక్స్  న్యూయార్క్ సిటీలో షేక్ స్పియర్, అండర్సన్ అవెన్యూలను కనెక్ట్ చేస్తూ  బ్రోంక్స్ స్ట్రీట్ నెంబర్ 167లో ఉన్న మెట్ల మీద నడుస్తూ చేసిన డ్యాన్సింగ్ ఫర్ఫామెన్స్ అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి. అంతే అభిమానులు ఆ డ్యాన్స్ చేసిన స్పాట్స్ ఎక్కడున్నాయని తెలుసుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. అంతే కాదండోయ్ జోకర్ గా మారి ఆ మెట్లపై సేమ్ జోకర్ సినిమాలో ఫ్లెక్ వేసిన స్టెప్స్ వేసి తెగ సంబరపడిపోతున్నారు.