స్టాండప్ కామెడీ షోలు అంటే నవ్వులు పూయించాలి, కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ముంబైలోని ప్రముఖ కేఈఎమ్ (KEM) హాస్పిటల్‌కు చెందిన ఒక లేడీ డాక్టర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి. సోషల్ మీడియాలో అయితే పెద్ద కార్చిచ్చును రేపుతున్నాయి. నవ్వుల కోసం చేసిన వ్యాఖ్యలు కాస్తా, మెడికల్ ఎథిక్స్ ను నిలదీసేలా మార్చాయి. ఆమెపై కేసు నమోదు చేయడమే కాదు.. ప్రత్యేక ఎంక్వైరీ కమిటీని వేశారు.
అసలేం జరిగిందంటే..?
ప్రముఖ కమెడియన్ ప్రణీత్ మోర్ చేసిన ఒక స్టాండప్ కామెడీ షోలో ఆడియన్స్ ఇంటరాక్షన్ జరిగింది. అందులో పాల్గొన్న కేఈఎమ్ హాస్పిటల్ థర్డ్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్ సెజల్ పవార్ ను కమెడియన్ ఒక ప్రశ్న అడిగాడు. పోస్ట్‌మార్టం రూమ్‌లో డాక్టర్లు సీరియస్‌గా ఉంటారా? లేక జోకులు వేసుకుంటారా? అని ప్రశ్నించారు. దానికి ఆమె నవ్వుతూ.. మెడికల్ కాలేజీ క్లాస్‌రూమ్‌లోని పురుషుల మృతదేహాల ప్రైవేట్ భాగాల సైజులను తాము, తమ ఫ్రెండ్స్ పోల్చి చూసేవాళ్లమంటూ ఓపెన్‌గా కామెంట్ చేసింది.
Sejal pawar doctor by profession talking about how she and her friends make fun of dead bodies about their dick size and made several nasty comments about male reproductive organ pic.twitter.com/q7rfQoi6DJ
— Aarohi (@hamlakroo) June 10, 2026
మృతదేహాలపై జోకులా.
ఈ వీడియో క్లిప్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు, తోటి వైద్య విద్యార్థులు రగిలిపోతున్నారు. శాస్త్ర విజ్ఞానం కోసం, కాబోయే డాక్టర్ల చదువు కోసం ఎందరో మహానుభావులు తమ శరీరాలను దానం చేస్తారు. అలాంటి పవిత్రమైన మృతదేహాలను ఇలా హేళన చేయడం అత్యంత హేయమైన చర్య అని మెడికల్ స్టూడెంట్స్ మండిపడుతున్నారు.
►ALSO READ | Kiran Abbavaram: డైరెక్టర్‌గా మారిన కిరణ్ అబ్బవరం.. సస్పెన్స్ కాన్సెప్ట్‌తో రాబోతున్న ‘KA13’
జెండర్ ఈక్వాలిటీ ఎక్కడ?
ఈ రచ్చ ఇంతటితో ఆగలేదు. మొన్నటికిమొన్న రూ.370 బిర్యానీ బిల్లు కట్టినందుకు డేటింగ్‌లో అమ్మాయి నుంచి ఏదో ఆశించానంటూ హిమాన్షు జంగ్రా అనే వ్యక్తి చేసిన కామెంట్స్‌కు దేశవ్యాప్తంగా మహిళలపై ద్వేషం అంటూ పెద్ద ఎత్తున దుమారం రేపింది. ఇప్పుడు నెటిజన్లు ఈ రెండు ఘటనలను లింక్ చేస్తూ .. అబ్బాయి తప్పు చేస్తే దేశమంతా వేలెత్తి చూపిస్తుంది. మరి అమ్మాయి చనిపోయిన పురుషుల శరీరాలపై ఇలాంటి కామెంట్స్ చేస్తే జెండర్ ఈక్వాలిటీ ఎటు పోయింది? అంటూ ప్రశ్నిస్తున్నారు.
క్షమాపణలు..
ట్రోలింగ్ నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లడంతో డాక్టర్ సెజల్ పవార్ తలదించుకోక తప్పలేదు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ ... నేను నా మాటలను సమర్థించుకోవాలని అనుకోవడం లేదు. పూర్తి బాధ్యత నాదే. నా మాటలు ఇంతలా హర్ట్ చేస్తాయని అనుకోలేదు, క్షమించండి అంటూ పోస్ట్ పెట్టింది. ఇక ఈ షోను హోస్ట్ చేసిన కమెడియన్ ప్రణీత్ మోర్ పరిస్థితి మరీ ఘోరంగా మారింది. నెటిజన్ల తిట్ల దెబ్బకు తట్టుకోలేక అతను ఏకంగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌నే డీయాక్టివేట్ చేసుకున్నాడు.
Sejal Pawar has shared an apology video.
— ︎ ︎venom (@venom1s) June 11, 2026
I'm sure she doesn't feel any guilt or shame.
She will soon be back with a victim card video, blame men, and gain another 200K followers.
All men should unfollow her.
She should be fired. pic.twitter.com/OFoOFDZGrS
వివాదంపై ఎంక్వైరీ కమిటీ
మరో వైపు ఈ వివాదంపై కేఈఎమ్ హాస్పిటల్ డీన్ డాక్టర్ హరీష్ పాఠక్ తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో తమ దృష్టికి వచ్చిందని, ఆమె చేసిన వ్యాఖ్యలు అస్సలు అంగీకరించలేనివి అని ఆయన తీవ్రంగా ఖండించారు. వైద్య విద్యార్థుల చదువు కోసం ఎంతో ఉదారతతో, భావోద్వేగాలతో కుటుంబ సభ్యులు మృతదేహాలను దానం చేస్తారని.. అలాంటి బాడీలకు ఇచ్చే గౌరవం విషయంలో రాజీ పడేదే లేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై నిజానిజాలు తేల్చేందుకు ఇద్దరు సభ్యులతో కూడిన ప్రత్యేక ఎంక్వైరీ కమిటీని వేశారు.
బాడీస్ డొనేట్ చేసేవారి నమ్మకాన్ని, భావోద్వేగాలను మేం గౌరవిస్తాం. ఈ ఘటనపై కమిటీ నివేదిక రాగానే కఠిన చర్యలు ఉంటాయి అని డీన్ డాక్టర్ హరీష్ పాఠక్ హెచ్చరించారు. 'నవ్వు నాలుగు విధాలా చేటు' కాదు.. ఇక్కడ 'నవ్వు కెరీర్‌కే చేటు' తెచ్చిపెట్టింది. కామెడీ పేరుతో హద్దులు దాటితే పోలీస్ లాకప్, కాలేజీ సస్పెన్షన్లు తప్పవని ఈ క్రేజీ ఇన్సిడెంట్ నిరూపించింది.
Mumbai, Maharashtra: Regarding Dr Sejal Pawar being booked for remarks made at a comedy show, Dean of KEM Hospital Dr Harish Pathak says, "Yesterday, we came to know through social media that a video is being circulated in which one of our students is seen making objectionable… pic.twitter.com/4C5ymHneD1
— IANS (@ians_india) June 12, 2026
