టాలీవుడ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. నిర్మాతగా, హీరోగా, దర్శకుడిగా ఆడియన్స్‌లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. గతేడాది వచ్చిన ‘క’ (KA) చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని అందరి దృష్టిని ఆకర్షించారు. ఇటీవలే తిమ్మరాజుపల్లి TVతో నిర్మాతగా మారి సక్సెస్ అందుకున్నాడు. ఈ క్రమంలోనే దర్శకుడిగా మారి కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
KA13 అనౌన్స్:
కిరణ్ అబ్బవరం హీరోగా నటించబోయే లేటెస్ట్ మూవీ అనౌన్స్ చేశారు. ‘KA13’ అనే వర్కింగ్ టైటిల్‌ను ఖరారు చేస్తూ మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు కిరణ్ అబ్బవరం స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్టర్, హీరో.. ఇలా అన్నీ తానై ఆడియన్స్ ముందుకు రానున్నాడు. ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం ‘KA13’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఫ్యాన్స్‌తో పంచుకున్నారు.
ఇవాళ జూన్ 12 నుంచే సినిమా షూటింగ్ షురూ అయిందని స్పష్టం చేశాడు. గతంలో కిరణ్ ‘SR కళ్యాణమండపం’ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే అందించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు. ఈ క్రమంలోనే దర్శకుడిగా మెగా ఫోన్ పట్టడంతో సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది.
ALSO READ : ఓటీటీలోకి బిగ్ బాస్ దివి బోల్డ్ సిరీస్..
పోస్టర్ చూస్తుంటే, కిరణ్ అబ్బవరం ఈసారి ఒక విభిన్నమైన కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సస్పెన్స్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు స్పష్టమవుతోంది. ఓ ఈవెంట్ కి సంబంధించిన వంట గదిలో భోజనం ప్రిపేర్ చేస్తూ స్టైల్ గా నిలబడి.. అదిరిపోయిందంటూ ఇచ్చే సిగ్నల్ ఆసక్తి పెంచుతుంది. జాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సుధాకర్ చాగంటి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, భీమ్స్ సంగీతం అందిస్తున్నారు.
With all your blessings 😇
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) June 12, 2026
From Today 😀@JoyFilmsllp @sudha_chaganti pic.twitter.com/3LtnjpRU4H
దర్శకుడిగా కొత్త ప్రయాణం..
సాధారణంగా ఒక హీరోకి వరుస విజయాలు వస్తున్నప్పుడు రెమ్యునరేషన్ పెంచి వరుసగా సినిమాలు చేయాలనుకుంటారు. కిరణ్ అబ్బవరం విషయంలోనూ అదే జరిగింది. ‘క’ విజయం తర్వాత ఆయనకు ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ నుంచి ఏకంగా రూ.10 కోట్లకు పైగా రెమ్యునరేషన్ ఇచ్చే ఆఫర్ వచ్చినట్లు ఇండస్ట్రీ టాక్. అయితే, కేవలం నటనకే పరిమితం కాకుండా, తనలోని సృజనాత్మకతకు పదును పెట్టాలని ఆయన భావిస్తున్నారు. అందుకే ఈ భారీ ఆఫర్లను పక్కనబెట్టి మెగా ఫోన్ పట్టేందుకు సిద్ధమయ్యారు.
కిరణ్ అబ్బవరం దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు ‘రియాలిటీ’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు టాక్. నేటి తరం ఆలోచనలకు అనుగుణంగా ఉండే ఒక వినూత్న కథాంశంతో ఈ చిత్రం రూపొందనుంది. ఈ భారీ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి వివరాలు, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు.
సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం..
నటుడు, దర్శకుడు, నిర్మాతగా ఒకేసారి మూడు బాధ్యతలను భుజానికెత్తుకోవడం సామాన్యమైన విషయం కాదు. టాలీవుడ్లో గతంలో దిగ్గజాలు చేసిన ఈ ఫీట్‌ను ఇప్పుడు కిరణ్ అబ్బవరం పునరావృతం చేయబోతున్నారు. కథాబలమున్న సినిమాలతో ప్రేక్షకులను మెప్పించే కిరణ్, మరి దర్శకుడిగా ‘KA13’తో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి.
This time , not just serving Entertainment but cooking along with it 🥂@JoyFilmsllp @sudha_chaganti pic.twitter.com/iI1AKQ06ds
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) June 11, 2026
