హవీష్ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘నేను రెడీ’. కోనేరు సత్యనారాయణ, నిఖిలా కోనేరు నిర్మిస్తున్నారు. ఇప్పటికే మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసి ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేయగా, తాజాగా రెండో పాటను విడుదల చేశారు. ‘మెరుపులే మెరుపులే’ అంటూ సాగే పాటను దర్శకుడు వీవీ వినాయక్ రిలీజ్ చేసి ఈ సినిమాతో హవీష్ పెద్ద కమర్షియల్ హీరో అవ్వాలని కోరారు.
ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో హవీష్ మాట్లాడుతూ ‘ఇదొక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారు’ అని చెప్పాడు. ఈ చిత్రం అందర్నీ ఎంటర్‌టైన్ చేస్తుందని దర్శకుడు త్రినాథరావు నక్కిన అన్నాడు. నిర్మాత నిఖిల కోనేరు మాట్లాడుతూ ‘సాంగ్ లాంచ్ చేసిన వినాయక్ గారికి థ్యాంక్స్.
త్రినాథరావు గత సినిమాలకంటే ఇది సూపర్ హిట్ అవుతుందని నమ్ముతున్నాం. ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాకు కూడా అలాంటి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నాం’ అని అన్నారు.
