పిల్లలు తినే పాస్తాలో బొద్దింక : జర్నలిస్ట్ ఫ్యామిలీకే ఎదురైన చేదు అనుభవం

పిల్లలు తినే పాస్తాలో బొద్దింక : జర్నలిస్ట్ ఫ్యామిలీకే ఎదురైన చేదు అనుభవం

అదో పెద్ద ప్లే గ్రౌండ్.. అక్కడికి వందల మంది పిల్లలు ఆడుకోవటానికి వస్తుంటారు.. పిల్లలను తీసుకుని వాళ్ల పేరంట్స్ వస్తూ ఉంటారు. అలాంటి చోట పిల్లల కోసమే ఓ రెస్టారెంట్ ఉంది. పాస్తా, నూడిల్స్ వంటి వంటకాలు ఉంటాయి.. అలాంటి చోటుకు తన పిల్లలను తీసుకుని ఓ ప్రముఖ హిందీ ఛానెల్ జర్నలిస్ట్ వచ్చారు. గేమ్స్ అయిపోయిన తర్వాత పిల్లల కోసం పాస్తా ఆర్డర్ చేశారు.. సగం తిన్నాక అందులో చచ్చిపోయిన బొద్దింక కనిపించింది. షాక్.. పిల్లలు తినే పాస్తాలో బొద్దింక అంటూ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ కు ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. 

ఇది నిమిషాల్లోనే వైరల్ అయ్యింది. జర్నలిస్ట్ ఫ్యామిలీకే చేదు అనుభవం ఎదురైంది.. ఇక సామాన్యుల పరిస్థితి  ఎలా ఉందో అంటూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ అంశంపై పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ముంబైలోని లోయర్ పరేల్‌లో ఉన్న ఒక ప్లే గ్రౌండ్ లోని రెస్టారెంట్ లో వడ్డించిన పాస్తాలో బొద్దింక కనిపించిందని ఎన్‌డిటివి ప్రాఫిట్‌లో ఛానెల్‌లో బ్యూరో చీఫ్‌గా పనిచేస్తున్న శ్రీమి చౌదరి ఎక్స్ వేదికగా వీడియో షేర్ చేశారు. 

ఆ ఫుడ్ కోర్ట్ లో కూర్చునే ఏరియాలో చనిపోయిన బొద్దింకలు ఉన్నాయని... ముంబై మున్సిపల్ కార్పొరేషన్, FDA, మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ను ట్యాగ్ చేస్తూ ఎక్స్ వీడియో షేర్ చేశారు శ్రీమి చౌదరి.తమ పిల్లల తిన్న తర్వాత తమకు కూడా పాస్తా వడ్డించారని... తమకు వడ్డించిన పాస్తాలో  బొద్దింక కనిపించిందని చెప్పుకొచ్చారు.