యూనివర్శిటీలు, కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్స్‌గా, జేఆర్‌ఎఫ్‌గా కెరీర్ ప్రారంభించాలనుకునే అభ్యర్థులకు సీఎస్ఐఆర్ యూనివర్శిటీ గ్రాంట్ కమిషన్ నెట్ (జూన్) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు10వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.
ఏటా జూన్, డిసెంబర్ నెలల్లో రెండు సార్లు దీనిని నిర్వహిస్తారు. తాజాగా జూన్ సెషన్ నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది. ఇందులో క్వాలిఫై అయితే హ్యూమానిటీస్, సైన్స్, సోషల్ సైన్సెస్, లాంగ్వేజస్ విభాగాల్లోని 100కు పైగా సబ్జెక్టుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్‌గా కెరీర్ ప్రారంభించడమే కాక జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ద్వారా పరిశోధనలు చేసి పీహెచ్‌డీ, ఎంఫిల్ చేసే అవకాశం లభిస్తుంది.
ఎగ్జామ్ ప్యాటర్న్: యూజీసీ–నెట్ పరీక్ష ఆన్‌లైన్ విధానం (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్)లో ఆబ్జెక్టివ్ తరహాలో నిర్వహిస్తారు. మొత్తం మూడు వందల మార్కులకు జరిగే ఈ పరీక్షలో పేపర్1, పేపర్ 2 ఉంటాయి. పేపర్–1కు అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అభ్యర్థులందరూ తప్పనిసరిగా హాజరు కావాలి.
పేపర్–1లో టీచింగ్/రీసెర్చ్ అప్టిట్యూడ్‌పై 50 ప్రశ్నలు–100 మార్కులు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు కేటాయించారు.
పేపర్–2.. అభ్యర్థులు తమ పీజీ స్పెషలైజేషన్ ఆధారంగా ఎంచుకున్న సబ్జెక్టుకు సంబంధించిన పరీక్ష ఉంటుంది. పేపర్–2లో సంబంధిత సబ్జెక్ట్ పేపర్ నుంచి 100 ప్రశ్నలు–200 మార్కులకు ఉంటాయి. పరీక్ష కాల వ్యవధి మూడు గంటలు.
పేపర్-1: ఇందులో అభ్యర్థుల టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్‍ను పరీక్షించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. అంతేకాకుండా కాంప్రహెన్సన్, అనాలసిస్, ఎవల్యూషన్, జనరల్ అవేర్‍నెస్ ఆన్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్, ఇంటరాక్షన్ బిట్వీన్ పీపుల్, న్యాచురల్ రీసోర్సెస్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ లైఫ్ అనే అంశాలపై అవగాహనను టెస్ట్ చేసేలా క్వశ్చన్స్ వస్తాయి. సిలబస్‍లో మొత్తం పది యూనిట్లు ఉండగా ఒక్కో యూనిట్ నుంచి 5 ప్రశ్నలు ఇస్తారు.
- టీచింగ్ ఆప్టిట్యూడ్ లో భాగంగా టీచింగ్ కాన్సెప్ట్, రిక్వైర్‌మెంట్స్, లెర్నర్స్ క్యారెక్టరిస్టిక్స్, టీచింగ్ విధానంలో ఇటీవల పాపులర్ అవుతున్న ఆన్‌లైన్ టీచింగ్, మూక్స్, స్వయం, స్వయంప్రభ, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇన్ టీచింగ్, చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ వంటి టాపిక్స్ బాగా చదువుకోవాలి.
- రీసెర్చ్ ఆప్టిట్యూడ్ లో అప్లికేషన్ ఆఫ్ ఐసీటీ ఇన్ రీసెర్చ్, థీసిస్, ఆర్టికల్ రైటింగ్, రీసెర్చ్ మెథడ్స్, స్టెప్స్, ఎథిక్స్, రీసెర్చ్ టైప్స్ వంటి అంశాలను నేర్చుకోవాలి. ఆ తర్వాత ప్యాసేజ్ ఇచ్చి దాని కింద 5 ప్రశ్నలు అడుగుతారు.
- కమ్యూనికేషన్ లో భాగంగా మీనింగ్, టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అండ్ ఇట్స్ బారియర్స్, మాస్ మీడియా సొసైటీ మీద ప్రశ్నలొస్తాయి.
- మ్యాథమెటికల్ రీజనింగ్ ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్ లో భాగంగా టైప్స్ ఆఫ్ రీజనింగ్, మ్యాథమెటికల్ ఆప్టిట్యూడ్, అనాలజీ, వెన్ డయాగ్రమ్స్ వంటి టాపిక్స్ ప్రాక్టీస్ చేయాలి. టేబుల్స్, బార్ గ్రాఫ్స్, పై చార్ట్స్, సోర్సెస్ ఆఫ్ డేటా వంటి డేటా ఇంటర్‌ప్రిటేషన్ టాపిక్స్ చదువుకోవాలి.
- ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో భాగంగా బేసిక్స్ ఆఫ్ ఇంటర్నెట్, ఈమెయిల్, ఆడియో వీడియో కాన్ఫరెన్స్, హయ్యర్ ఎడ్యుకేషన్ డిజిటల్ ఇనిషియేటివ్స్ వంటి అంశాలను స్టడీ చేయాలి.
- ఎన్విరాన్ మెంటల్ డెవలప్‌మెంట్, న్యాచురల్ అండ్ ఎనర్జీ రీసోర్సెస్, విపత్తులు వాటి నివారణ చర్యలు, ఎన్విరాన్‌మెంటల్ చట్టాలు, మాంట్రియల్ ప్రోటోకాల్, ప్యారిస్ అగ్రిమెంట్, ఇంటర్నేషనల్ సోలార్ అగ్రిమెంట్ వంటి టాపిక్స్ తప్పకుండా చదవాలి.
- హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా, కన్వెన్షనల్ నాన్ కన్వెన్షనల్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్, ప్రొఫెషనల్, టెక్నికల్ అండ్ స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ వంటి సబ్ టాపిక్స్ ను చూసుకోవాలి.
పేపర్-2 : ఈ పేపర్‍లో 101 సబ్జెక్టులున్నాయి. అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టు నుండి పీజీ స్థాయిలో ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నలన్నీ అప్లికేషన్ ఓరియంటెడ్‍గా ఉంటాయి కాబట్టి సెలెక్టెడ్ సబ్జెక్టులో ఇంటర్ నుంచి పీజీ వరకు ఎన్‍సీఈఆర్‍టీ, యూనివర్శిటీ పుస్తకాలు, ఇతర నిపుణులు రాసిన బుక్స్ చదవడం వల్ల మంచి మార్కులు పొందొచ్చు. ముఖ్యంగా పాత ప్రశ్నా పత్రాల్లోని ప్రశ్నలను విశ్లేషించుకొని ప్రతి ప్రశ్నను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. దానికి సంబంధించిన ప్రశ్నలు ఇతర పుస్తకాల్లో ఉంటే.. వాటినీ చదవాలి. ఇతర పరీక్షల లాగా నాలుగు ఆప్షన్లలో ఏదో ఒకటి ఊహించి రాయవచ్చు అనుకుంటే పొరబడినట్లే. ఇందులో ప్రశ్నలన్నీ నిజజీవితానికి దగ్గరగా ఉండే సంఘటనల ఆధారంగా రూపొందించడమే కాక అభ్యర్థిని తికమక పెట్టేలా ఉంటాయి. యూజీసీ నెట్ వెబ్ సైట్‌లో దాదాపు పదేళ్లకు పైగా ప్రీవియస్ పేపర్లు, సబ్జెక్టుల వారీ సిలబస్, కటాఫ్ స్కోర్స్ వంటివి అందుబాటులో ఉన్నాయి. వాటిని బాగా ప్రాక్టీస్ చేస్తే పేపర్-2 లో అధిక మార్కులు పొందవచ్చు.
నెట్ బెనిఫిట్స్
నెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు యూనివర్సిటీలు, డిగ్రీ, పీజీ కాలేజీల్లో జూనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ లెవెల్‌లో కెరీర్ ప్రారంభించవచ్చు. ఈ సమయంలోనే యావరేజ్ శాలరీ సంవత్సరానికి ఆరు లక్షల వరకు ఉంటుంది. ఆ తర్వాత పనితీరు ఆధారంగా అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ గా ప్రమోషన్లు లభిస్తాయి. ఈ దశలో దాదాపు రూ.15 నుంచి రూ.20 లక్షల వేతనాలు అందుకోవచ్చు. ఫుల్‌టైమ్ టీచింగ్ కెరీర్ కాకుండా డిఫరెంట్ గా ఆలోచించేవారు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్, ఆథర్, గెస్ట్ ఫ్యాకల్టీ, కన్సల్టెంట్, ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ట్యూటర్, ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్, ల్యాబ్ ట్రైనర్ వంటి పోస్టులను ఎంపిక చేసుకోవచ్చు. అయితే వీటిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ కి వచ్చినంత వేతనాలు అందకపోవచ్చు. వీటితో పాటు ప్రభుత్వ రంగంలోని మహారత్న, నవరత్న, మినీరత్న కంపెనీలు నెట్ క్వాలిఫైడ్ అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి రిక్రూట్ చేసుకుంటాయి. యూజీసీ కింద పనిచేసే ల్యాబోరేటరీలు, ఇతర ఇండస్ర్టీలు నెట్ క్వాలిఫైడ్ వారిని మాత్రమే నియమించుకుంటున్నాయి. జేఆర్‌ఎఫ్ క్వాలిఫై అయినవారు యూనివర్శిటీల్లో మూడేళ్లపాటు జూనియర్ రీసెర్చ్ ఫెలోగా పనిచేయాలి. అనంతరం సీనియర్ రీసెర్చ్ ఫెలోగా ప్రమోషన్ వస్తుంది.
పేపర్-1 సిలబస్
టీచింగ్ ఆప్టిట్యూడ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్
కాంప్రహెన్షన్ కమ్యూనికేషన్
మ్యాథమెటికల్ రీజనింగ్‍అండ్ ఆప్టిట్యూడ్ లాజికల్ రీజనింగ్
డేటా ఇంటర్‌ప్రిటేషన్
ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ పీపుల్ డెవలప్‍మెంట్‍అండ్ ఎన్విరాన్‌మెంట్
హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్
నోటిఫికేషన్
విభాగాలు : కెమికల్ సైన్సెస్, ఎర్త్, అట్మాస్ఫిరిక్, ఓషన్ అండ్ ప్లానిటరీ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, మ్యాథమేటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్.
అర్హత : కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఎమ్మెస్సీ/ ఇంటిగ్రేటెడ్ బీఎస్ఎంఎస్/ నాలుగేళ్ల బీఎస్/ బీఈ/ బీటెక్/ బీఫార్మసీ/ ఎంబీబీఎస్ ఉత్తీర్ణత. జేఆర్ఎఫ్ అభ్యర్థులు 1 జులై 2021 నాటికి 28 ఏళ్లు మించకూడదు. లెక్చర్‌షిప్ (ఎల్‌ఎస్)/ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు వయసుతో సంబంధం లేదు. ఉమ్మడి జాతీయ అర్హత పరీక్ష (నెట్) ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
అప్లికేషన్ ప్రాసెస్ : అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ఆగస్టు 10వ తేదీ వరకు అప్లై చేసుకోవాలి. జనరల్ అభ్యర్థులు రూ.1000, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు రూ.250 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
వెబ్సైట్: www.csirnet.nta.nic.in
-వెలుగు ఎడ్యుకేషన్ డెస్క్
