
జూబ్లీహిల్స్ బైపోల్ షెడ్యూల్ ప్రకటించింది జాతీయ ఎన్నికల సంఘం. బీహార్ తో పాటు దేశ వ్యాప్తంగా 8 స్థానాలకు ఉపఎన్నిక షెడ్యూల్ ను రిలీజ్ చేశారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్. జూబ్లీహిల్స్ బైపోల్ నవంబర్ 11న జరగనుండగా..14న కౌంటింగ్ జరగనుంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్
- అక్టోబర్ 13 న నోటిఫికేషన్
- అక్టోబర్ 13న నామినేషన్ల స్వీకరణ
- అక్టోబర్ 21న నామినేషన్లకు చివరి తేది
- అక్టోబర్ 22న నామినేషన్ల పరిశీలన
- అక్టోబర్ 24న నామినేషన్ల విత్ డ్రా
- నవంబర్ 11న పోలింగ్
- నవంబర్ 14న కౌంటింగ్
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ 2025జూన్ 8న మృతి చెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ నెలకొంది. బీఆర్ఎస్ తమ అభ్యర్థిగా మాగంటి గోపినాథ్ భార్య మాగంటి సునీతను ప్రకటించింది. ఎలాగైనా సిట్టింగ్ సీటును దక్కించుకోవాలని చూస్తోంది.
కాంగ్రెస్ లో తీవ్ర పోటీ
ఇక కాంగ్రెస్ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. ప్రధానంగా ముగ్గురి పేర్లు రాష్ట్ర అధిష్టానం ఏఐసీసీకి పంపించింది. అందులో ఒకరు నవీన్ యాదవ్, బొంతురామ్మోహన్, రహమత్ నగర్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి ఉన్నారు. ఇందులో ఎవరికో ఒకరకి జూబ్లీహిల్స్ టికెట్ దక్కనుంది.
ఫైనల్ కానీ అభ్యర్థి
ఇక బీజేపీ కూడా అభ్యర్థిని ఫైనల్ చేయలేదు. జూబ్లీహిల్స్ టికెట్ కోసం బీజేపీ నుంచి లంకాల దీపక్ రెడ్డి, జయసుధ, చింతల రామచంద్రరావు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. చివరికి ఎవరు బరిలో ఉంటారో చూడాలి.
3 లక్షల 99 వేల ఓటర్లు
జూబ్లీహిల్స్ లో మొత్తం 3,98,982 మంది ఓటర్లు ఉండగా ఇందులో పురుష ఓటర్లు 2,07,367 మంది, మహిళా ఓటర్లు 1.91,590 మంది ఉన్నారు. అలాగే ఇతరులు 25 మంది ఉన్నారు. నియోజకవర్గం ఓటర్లలో 80 ఏండ్లకు పైబడిన వృద్ధుల్లో పురుషులు 3,280 మంది, మహిళలు 2,772 మంది ఉన్నారు. ఇక ఎన్ఆర్ఐ ఓటర్లు 95 మంది కాగా, సర్వీస్ ఎలక్టోరల్స్ 18, పీడబ్ల్యూడీ ఓటర్లు 1,891 మంది నమోదయ్యారు. నియోజకవర్గంలో 407 పోలింగ్ స్టేషన్లుండగా.. ఒక్కో పోలింగ్స్టేషన్లో యావరేజ్‌గా 980 మంది ఓటర్లు ఉన్నారు.
►ALSO READ | తెలంగాణలో ఎలి లిల్లీ రూ.9 వేల కోట్ల పెట్టుబడులు : ఫార్మా రంగానికి బూస్ట్ అన్న సీఎం రేవంత్ రెడ్డి